Elections:"డిపాజిట్ గల్లంతు" అంటాం..దీని అర్థం ఇదే.!

ఎన్నికలు వచ్చాయి అంటే చాలు ఎక్కడో ఉన్న నాయకులంతా ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ ఉంటారు. మూడు సభలు ఆరు స్పీచ్ లుగా వారి ప్రచారం

Elections:డిపాజిట్ గల్లంతు అంటాం..దీని అర్థం ఇదే.!
X

న్యూస్ లైన్ డెస్క్: ఎన్నికలు వచ్చాయి అంటే చాలు ఎక్కడో ఉన్న నాయకులంతా ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ ఉంటారు. మూడు సభలు ఆరు స్పీచ్ లుగా వారి ప్రచారం కొనసాగుతుంది. అలాగే నామినేషన్స్, విత్ డ్రా అనే పదాలు కూడా వింటూ ఉంటాం. అలాంటి ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చిన సమయంలో డిపాజిట్ గల్లంతు అనే పదాలు కూడా వింటాం. అయితే ఈ పదాలు వినడమే కానీ డిపాజిట్ గల్లంతూ అనే పదానికి అర్థం చాలా మందికి తెలియదు. ఈ పదాన్ని ఎందుకు వాడుతారు అనేది క్లియర్ గా తెలుసుకుందాం..

నామినేషన్ వేసిన సమయంలో అభ్యర్థులు కొంత నగదును చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఆ డబ్బు ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులకు తిరిగి ఇస్తే దాన్ని గౌరవప్రదమైన ఓటమి అంటారు. ఒకవేళ ఆ డబ్బులు ఇవ్వకపోతే డిపాజిట్ గల్లంతయింది అని అంటారు. ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లలో ఆరవ వంతు ఓట్లను ఏ అభ్యర్థి అయిన పొందవలసి ఉంటుంది. ఒకవేళ ఆ అభ్యర్థి పొందకపోతే ఆయన డిపాజిట్ గల్లంతయినట్టే.

ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో వెయ్యి మంది ఓట్లు వేశారు అనుకుంటే, అక్కడ నామినేషన్ వేసిన అభ్యర్థులు ఇందులో 160 కన్నా ఎక్కువ ఓట్లు సాధించవలసి ఉంటుంది. అంటే 16% కంటే ఎక్కువ ఓట్లు వస్తే వారు డిపాజిట్ డబ్బులను తిరిగి మనకి ఇస్తారు. ఒకవేళ ఆ ఓట్లు రాకపోతే ఆ అమౌంట్ ఎన్నికల సంఘం వారు స్వాధీనం చేసుకుంటారు. కారణంగా ఏ నియోజకవర్గంలో అయినా కొంతమంది స్వతంత్రంగా చేసిన అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడం మనం చూస్తూనే ఉంటాం.

Tags:
Next Story
Share it