IPL2024 : ఐపీఎల్ 2024 ప్లే ఆప్స్ నుండి తొలగిపోయిన మొట్టమొదటి టీం!

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఎవ్వరూ ఊహించని స్కోర్స్ తో దూసుకుపోతున్న సంగతి మనమంతా చూస్తూనే ఉన్నాం. 250 కి పైగా స్కోర్స్ దాదాపుగా 8 సార్లు దాటారంటే ఇది ఏ స్థాయి టోర్నమెంట్ అనేది అర్థం చేసుకోవచ్చు.

IPL2024 : ఐపీఎల్ 2024 ప్లే ఆప్స్ నుండి తొలగిపోయిన మొట్టమొదటి టీం!
X

న్యూస్ లైన్ డెస్క్: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఎవ్వరూ ఊహించని స్కోర్స్ తో దూసుకుపోతున్న సంగతి మనమంతా చూస్తూనే ఉన్నాం. 250 కి పైగా స్కోర్స్ దాదాపుగా 8 సార్లు దాటారంటే ఇది ఏ స్థాయి టోర్నమెంట్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక నేడు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన టోర్నమెంట్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ముంబై ఇండియన్స్ టీం పై 11 పరుగుల తేడాతో గెలుపొందింది. 257 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం బౌలింగ్ లో కూడా అదిరిపోయే ఫామ్ తో ముంబై ఇండియన్స్ టీం ని కట్టడి చేసే ప్రయత్నం చేసింది.

ఇషాంత్ కిషన్, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ లాంటి మెయిన్ వికెట్స్ ని తీసి ముంబై ఇండియన్స్ టీం ని కష్టాల్లోకి నెట్టేసింది. అయితే మధ్యలో తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ముంబై ఇండియన్స్ టీం లో కాస్త ఉత్సాహం పెంచినప్పటికీ, చివరి ఓవర్ లో రన్ అవుట్ అవ్వడం తో టీం ఓటమి నిశ్చయం అయ్యింది. ఒకవేళ తిలక్ వర్మ రన్ అవుట్ అవ్వకపోయ్యుంటే ముంబై ఇండియన్స్ టీం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉండేవి. అలా 247 పరుగుల వద్ద 9 వికెట్లు నష్టపోయి 11 పరుగుల తేడా తో ముంబై ఇండియన్స్ టీం ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ తో ముంబై ఇండియన్స్ టీం అధికారికంగా ప్లే ఆప్స్ నుండి తప్పుకుంది.

Tags:
Next Story
Share it