IPL 2024: ఇవాళ మరో రెండు మ్యాచ్ లు..హైదరాబాద్ విజృంభిస్తుందా ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. సండే కావడంతో... షెడ్యూల్ ప్రకారం ఇవాళ రెండు మ్యాచ్లు నిర్వహిస్తున్నారు.

IPL 2024: ఇవాళ మరో రెండు మ్యాచ్ లు..హైదరాబాద్ విజృంభిస్తుందా ?
X

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. సండే కావడంతో... షెడ్యూల్ ప్రకారం ఇవాళ రెండు మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. ఇక మొదటి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. అయితే గుజరాత్ (Gujarat Titans ) వర్సెస్ బెంగళూరు (Royal Challengers Bengaluru) మ్యాచ్లో... ప్రస్తుతానికి బెంగళూరు కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ రెండు జట్లు ఈ మ్యాచ్లో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఏదైనా ఒక జట్టు ఓడిపోతే ఆ జట్టుకు ప్లే ఆఫ్ ఆశలు ఉండవన్నమాట.

ఇక రెండవ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్.. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో చెన్నైలో జరగనుంది. అయితే ఈ రెండు జట్లకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం. గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫామ్ అవుతుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ జట్టును తక్కువ అంచనా వేయలేం. ఎప్పుడు ఏ జట్టు ఎలా ఆడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేది మనం ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. అయితే చాలామంది అభిమానులు మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించాలని కోరుకుంటున్నారు. కాగా పాయింట్స్ టేబుల్ లో హైదరాబాద్ జట్టు మూడవ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

Tags:
Next Story
Share it