IPL2024: ఐపీఎల్ లో మరో భారీ స్కోర్..దుమ్ములేపిన ఢిల్లీ క్యాపిటల్స్!

ఐపీఎల్ చరిత్రలో మరో భారీ స్కోర్ నమోదు అయ్యింది. నేడు జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ముంబై ఇండియన్స్ టీం.

IPL2024: ఐపీఎల్ లో మరో భారీ స్కోర్..దుమ్ములేపిన ఢిల్లీ క్యాపిటల్స్!
X

న్యూస్ లైన్ డెస్క్: ఐపీఎల్ చరిత్రలో మరో భారీ స్కోర్ నమోదు అయ్యింది. నేడు జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ముంబై ఇండియన్స్ టీం. అయితే మొదటి ఓవర్ నుండి అద్భుతమైన బ్యాట్టింగ్ తో విరుచుకుపడిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం 257 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో 250 కి పైగా పరుగులు రావడం ఇది 8 వ సారి అని చెప్పొచ్చు. నిన్ననే మనం పంజాబ్ కింగ్స్, కోల్ కత్తా నైట్ రైడర్స్ టీమ్స్ మధ్య మ్యాచ్ చూసే ఉంటాము. ఈ మ్యాచ్ లో కోల్ కత్తా టీం 261 పరుగులు తియ్యగా, భారీ లక్ష్యం తో రంగం లోకి దిగిన పంజాబ్ కింగ్స్ టీం కేవలం 18 ఓవర్లు లోనే లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్ ని ముగించారు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ టీం కూడా అలా భారీ లక్ష్యాన్ని ఛేదించి గెలుస్తారో లేదో చూడాలి.

Tags:
Next Story
Share it