IPL: పంజాబ్ పై బెంగళూరు విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌లో భాగంగా బుధవారం సాయత్రం జరిగిన బెంగళూరు వర్సెస్ పంజాబ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది.

IPL: పంజాబ్ పై బెంగళూరు విజయం
X

ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

హాఫ్ సెంచరీతో చెలరేగిన విరాట్

పాటిదర్ మెరుపు ఇన్నింగ్స్

న్యూస్ లైన్ స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌లో భాగంగా బుధవారం సాయత్రం జరిగిన బెంగళూరు వర్సెస్ పంజాబ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఆర్సీబీ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, విల్ జాక్స్ అర్థ సెంచరీలతో అదరగొట్టాగా కెమెరాన్ గ్రీన్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. దీంతో బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్టుపై 60 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్(9) విధ్వత్ కవిరప్ప బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత విల్ జాక్స్(12) కూడా పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. తర్వాత క్రీజులో రజత్ పాటిదార్ దిగాడు. ఈ విరాట్, పాటిదార్ ఇద్దరు కలిసి దూకుడు ఇన్నింగ్స్ ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మరోవైపు పాటిదార్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బౌండరీలు, సిక్సర్లు బాదుతూ పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో రజత్ పాటిదార్( 23 బంతుల్లో 55 పరుగులు 3 ఫొర్లు, 6 సిక్సర్లు)తో ఫిఫ్టి పూర్తి చేసుకున్నాడు. ఇక విరాట్ హార్డ్ హిటింగ్ బ్యాటింగ్ చేశాడు. బౌండరీలు, సిక్సర్లు కొడుతూ పంజాబ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఈ జోడి కలిసి ఆర్సీబీ స్కోర్ బోర్డుకు 100 రన్స్ జతచేశారు. అయితే పాటిదార్(55) సామ్ కరెన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టే ప్రయత్నంలో బౌండరీ వద్ద బెయిర్ స్ట్రోకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ సమయంలో బ్యాటింగ్‌కు కెమెరాన్ గ్రీన్ వచ్చాడు. కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. ఇక కోహ్లీ( 33 బంతుల్లో 56 రన్స్ 6 ఫొర్లు, 2 సిక్సర్లు) సహాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో గ్రీన్ పంజాబ్ బౌలర్లను దంచికొట్టాడు. బౌండరీలు స్కోర్ చేస్తూ ఆర్సీబీ స్కోర్‌ను పెంచ్చాడు. ఈ సమయంలో విరాట్ గేర్ మార్చి ధర్మశాలలో సిక్సర్లతో హోరెత్తించాడు. ఈ ఇద్దరు కలిసి స్కోర్ బోర్డుకు 60 రన్స్ జోడించారు. అయితే కోహ్లీ(92) అర్షదీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత క్రీజులో దీనేష్ కార్తీక్ దిగాడు. గ్రీన్‌తో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. వీళ్లద్దరూ క్రీజులో ఉండి బెంగళూరు జట్టుకు భారీ స్కోర్‌ను అందించారు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లు హర్షల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టాగా.. విధ్వత్ కవిరప్ప రెండు వికెట్లు తీశాడు.

భారీ లక్ష్యాని ఛేదించేందుకు బరిలో దిగిన పంజాబ్ కింగ్స్ జట్టుకు ఓపెనర్లు షాక్ తగిలింది. ప్రబ్ సిమ్రాన్(6) స్వప్నిల్ సింగ్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. తర్వాత జానీ బెయిర్ స్ట్రో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే లూకి ఫర్గూసన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. దీంతో పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. తర్వాత రిలీ రోసో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. ఆర్సీబీ బౌలర్లకు ఊచకోత చూపిస్తూ రోసో( 21 బంతుల్లో 54 పరుగులు 8 ఫోర్లు, 2 సిక్సర్లు )తో పూర్తి చేసుకున్నాడు. వైపు శశాంక్ సింగ్ డేంజరస్ బ్యాటింగ్ చేశాడు. రిలీ రోసో తో కలిసి దూకుడు బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. అయితే రోసో(61) కరణ్ శర్మ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఈ సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన జితేష్ శర్మ(), లియామ్ లివింగ్ స్టోన్ (0) బ్యాటింగ్ లో విఫలమయ్యారు. దీంతో పంజాబ్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. తర్వాత వచ్చిన సామ్ కరెన్(22) కాసేపు క్రీజులో కుదురుకున్నాడు. కానీ ఫర్గూసన్ బౌలింగ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన అషుతోష్ శర్మ(8), హర్షల్ పటేల్(4), రాహుల్ చాహర్(5) పేలవ ప్రదర్శన్ తో నిరాశ పరిచారు. దీంతో బెంగళూరు, పంజాబ్ జట్టుపై 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్లు మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టాగా.. ఫర్గూసన్, కరణ్ శర్మ, స్వప్నిల్ సింగ్ తలా రెండు వికెట్లు తీశారు.

Tags:
Next Story
Share it