7 సీట్లతో అద్భుత Tata Sumo..ధర కూడా తక్కువే.!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో 7-సీటర్ ఎస్‌యూవీకి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, టాటా మోటార్స్ తన కొత్త టాటా సుమో ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ లగ్జరీ SUV

7 సీట్లతో అద్భుత Tata Sumo..ధర కూడా తక్కువే.!
X

న్యూస్ లైన్ డెస్క్: భారత ఆటోమొబైల్ మార్కెట్లో 7-సీటర్ ఎస్‌యూవీకి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, టాటా మోటార్స్ తన కొత్త టాటా సుమో ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ లగ్జరీ SUV టయోటా ఇన్నోవా, మహీంద్రా వంటి కార్లకు గట్టి పోటీని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ టాటా సుమో డిజైన్ ఆకర్షణీయంగా, స్టైలిష్ గా ఉంది. ఇది పెద్ద గ్రిల్, LED హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్స్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, సొగసైన బాడీ లైన్‌లను కలిగి ఉంది.

దీని ఇంటీరియర్ కూడా చాలా ప్రీమియంగా ఉందట. ఇందులో సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, లెదర్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి. ఈ టాటా సుమోలో అనేక ఆధునిక మరియు శక్తివంతమైన ఫీచర్లు అందించబడ్డాయి. వీటిలో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, JBL ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 7 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఈ టాటా సుమో రెండు ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది.

2.2-లీటర్ డీజిల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్. డీజిల్ ఇంజన్ 170 PS పవర్, 350 Nm టార్క్, పెట్రోల్ ఇంజన్ 160 PS పవర్ మరియు 240 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.ఈ టాటా సుమో ప్రారంభ ధర ₹14 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా అంచనా వేయబడింది. ఇది 5 వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందట. అవి XE, XM, XT, XZ, XZ+ వంటి మోడల్స్ లో వస్తుందట.

Tags:
Next Story
Share it