Bharti Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్...నెట్ ఫ్లిక్స్ పై బంపర్ ఆఫర్ !

ఇండియా( INIDIA) లో రెండో అతి పెద్ద టెలికాం( TELICOM) సంస్థ భారతి ఎయిర్ టెల్ యూజర్లకు ఎయిర్ టెల్ ( AIRTEL) గుడ్ న్యూస్ చెప్పింది.

Bharti Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్...నెట్ ఫ్లిక్స్ పై బంపర్ ఆఫర్ !
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇండియా( INIDIA) లో రెండో అతి పెద్ద టెలికాం( TELICOM) సంస్థ భారతి ఎయిర్ టెల్ యూజర్లకు ఎయిర్ టెల్ ( AIRTEL) గుడ్ న్యూస్ చెప్పింది. ఒక ప్రీపెయిడ్ ప్లాన్, రెండు పోస్ట్‌పెయిడ్ మొత్తం మూడు ప్లాన్ల కింద నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఆఫర్ చేసింది. అది కూడా చాలా తక్కువ ధరకు అందిస్తుంది.

ఎయిర్‌టెల్ ( AIRTEL) అందిస్తున్న రూ. 1,199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ కింద నెట్‌ఫ్లిక్స్( NETFLIX), అమెజాన్ ప్రైమ్( AMAZON PRIME VIDEO) వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్( HOTSTAR) మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఇక రూ.1499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో కూడా ఈ మూడు ప్లాట్‌ఫామ్స్‌ను ఉచితంగా అందిస్తోంది. రూ.1,499 ప్రీపెయిడ్ ప్లాన్‌ను 100 రోజుల వ్యాలిడిటీతో ప్రతి రోజూ 3జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్‌లను( SMS) ఆఫర్ చేస్తోంది. అదనపు ప్రయోజనాలుగా నెట్‌ఫ్లిక్స్ బేసిక్( NETFLIX) , అపరిమిత 5జీ డేటా, అపోలో 24|7 సర్కిల్ సేవలు, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్‌లను పొందొచ్చని ఎయిర్‌టెల్ వెల్లడించింది.

నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్స్ భారతీయ యూజర్లకు కాస్త ఇంపార్టెంట్ అనే చెప్పాలి. కాస్త హాలివుడ్ ,బాలీవుడ్ , టాలీవుడ్ తో పాటు అన్ని బాషల వారికి ఈ నెట్ ఫ్లిక్స్ చాలా ఫేవరేట్. అందులోను నెట్ ఫ్లిక్స్ నెలవారీగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మొబైల్ రీఛార్జుల ద్వారా లభించే ఉచిత నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌( NETFLIX SUBSCRIPTION) యూజర్లకు చక్కటి వ్యాల్యూను జత చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:
Next Story
Share it