Jobs: కనుమరుగు కానున్న కాల్ సెంటర్స్.. ఎందుకంటే..?

దీని ద్వారా చాలా మార్పులు సంభవించే అవకాశం ఉందని, అసలు కాల్స్ మాట్లాడడానికి ఉద్యోగులను కూడా నియమించాల్సిన అవసరం ఉండదని కృతివాస‌న్ వివరించారు.

Jobs: కనుమరుగు కానున్న కాల్ సెంటర్స్.. ఎందుకంటే..?
X

న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా ఏ సమాచారం కావాలన్నా సంబంధిత కాల్ సెంటర్లను సంప్రదిస్తాం. అయితే, ఈ కాల్ సెంటర్స్ లేకపోతే ఎలా..? అవును. రానున్న రోజుల్లో కాల్ సెంటర్స్ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందట. ప్రస్తుతం ఉన్న టెక్ యుగంలో కృత్రిమ మేధ(AI) అనూహ్య రీతిలో వృద్ధి చెందుతోంది. అయితే, ఈ AI ప్రభావం ITతో పాటు ఇతర రంగాలపై కూడా అధికంగా ఉండబోతుందని నిపుణులు ముందు నుంచే చెబుతూనే ఉన్నారు.

తాజాగా, భారత అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) CEO కృతివాస‌న్(Kruthi vasan) కూడా దీనిపై స్పందించారు. రానున్న రోజుల్లో కాల్ సెంటర్స్ అవసరం లేకుండా పోతుందని ఆయన హెచ్చరించారు. కాల్ సెంటర్స్ లోని ఎన్నో ఉద్యోగాలను AI భర్తీ చేయగలదని ఆయన వెల్లడించారు. కస్టమర్లకు వచ్చే సమస్యలను AI ముందుగానే ఉహించగలదని ఆయన అన్నారు. దీని ద్వారా ముందుగానే ఆ సమస్యలను పరిష్కరించగలదని తెలిపారు. దీని ద్వారా చాలా మార్పులు సంభవించే అవకాశం ఉందని, అసలు కాల్స్ మాట్లాడడానికి ఉద్యోగులను కూడా నియమించాల్సిన అవసరం ఉండదని కృతివాస‌న్ వివరించారు.

Tags:
Next Story
Share it