Honor:అద్భుత కెమెరా క్వాలిటీతో హానర్ ఫోన్.ఫీచర్స్ మామూలుగా లేవు..!

ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఇందులో మంచి గుర్తింపు సాధించి దూసుకుపోతున్న మొబైల్ కంపెనీ హానర్. అలాంటి ఈ కంపెనీ నుంచి సరికొత్త మొబైల్

Honor:అద్భుత కెమెరా క్వాలిటీతో హానర్ ఫోన్.ఫీచర్స్ మామూలుగా లేవు..!
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఇందులో మంచి గుర్తింపు సాధించి దూసుకుపోతున్న మొబైల్ కంపెనీ హానర్. అలాంటి ఈ కంపెనీ నుంచి సరికొత్త మొబైల్ త్వరలో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ ఫోన్ విడుదలకు ముందే కొన్ని ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. Honor 200lite మొబైల్ థాయిలాండ్ NBTC సర్టిఫికెట్ కూడా పొందింది. అయితే ఈ బ్రాండ్ ను ఏప్రిల్ 25న ఫ్రాన్స్ లో లాంచ్ చేయడానికి సిద్ధమైందట. అలాంటి ఈ మొబైల్ యొక్క ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మొబైల్ అద్భుత డిస్ప్లేను కలిగి, డ్యూయల్ సెల్ఫీ కెమెరా సిస్టంతో మన ముందుకు వస్తోందట. ఇక దీని కెమెరా విషయానికి వస్తే 108 ఎంపీ మెగాపిక్సల్ డ్యూయల్ కెమెరా యూనిట్, ఎల్ఈడి ఫ్లాష్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ యొక్క మొబైల్ ఎడమ భాగంలో సిమ్ స్లాట్ కలిగి ఉండడమే కాకుండా కుడివైపున వాల్యూం రాకర్, పవర్ బటన్, ఫింగర్ ప్రింట్ స్కానర్, అనుసంధానం చేయబడి ఉంటుందట. ఈ హానర్ ఫోన్ లైట్ మిడ్ నైట్ బ్లాక్ , సియాన్ లేక్ మరియు టెక్స్ చర్డ్ స్టర్రి బ్లూ వంటి మూడు షేడ్స్ లో అందుబాటులోకి వస్తుందట.

అంతేకాకుండా ఈ మొబైల్ 6.78 MM మందం కలిగి 166 గ్రాముల వెయిట్ ఉంటుందట. అయితే ఈ మొబైల్ చైనీస్ మార్కెట్లో ప్రత్యేకంగా లభ్యమయ్యే Honor X50i+ మొబైల్ ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయో దీనిలో కూడా ఆ విధంగానే ఫీచర్స్ కలిగి ఉందట. 6.7 అంగుళాల ఆమోలెడ్ ఎఫ్ హెచ్ డీ +,90Hz డిస్ప్లే కలిగి ఉండడమే కాకుండా, డైమన్ సిటీ 6080 చిప్సెట్, 12జీబీ Ram, 256జీబీ /512జీబీ స్టోరేజ్ కలిగి 4500mAh బ్యాటరీతో మన ముందుకు వస్తోందట. అంతేకాకుండా మ్యాజిక్ ఓఎస్ 7.2 ఆదారిత ఆండ్రాయిడ్ 13 పై ఆధారపడి పనిచేస్తుందట. ఈ ఫోన్ ధర ఇతర వివరాలు లాంచ్ అయిన తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది.

Tags:
Next Story
Share it