JHEV ALPHA R5 స్కూటర్. ఒక్క ఛార్జ్ 300కీ"మీ".!

ప్రస్తుత కాలంలో పెట్రోల్, డీజిల్ స్కూటర్ల కంటే ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం ఎక్కువగా పెరుగుతుంది. దీని వల్ల పర్యావరణ కలుషితం అవ్వదు కాబట్టి కేంద్ర, రాష్ట్ర

JHEV ALPHA R5 స్కూటర్. ఒక్క ఛార్జ్ 300కీమీ.!
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో పెట్రోల్, డీజిల్ స్కూటర్ల కంటే ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం ఎక్కువగా పెరుగుతుంది. దీని వల్ల పర్యావరణ కలుషితం అవ్వదు కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వాహనాల తయారీకి అనుమతులు ఇస్తున్నాయి. దీంతో మార్కెట్లోకి రోజుకో కొత్తరకం ఎలక్ట్రికల్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. మంచి గుర్తింపుతో దూసుకుపోతున్నటువంటి కంపెనీ JHEV ALPHA R5 అనే ఎలక్ట్రికల్ స్కూటర్. దీని యొక్క ప్రత్యేకతలు, ధర వివరాలు చూద్దాం..

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ కలిగినటువంటి స్కూటర్ కోసం మీరు ఎదురు చూస్తున్నారా. అలాంటివారికి ఈ స్కూటర్ సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఈ స్కూటర్ 300 కిలోమీటర్ల పరిధితో దూసుకుపోతోంది. దీని ప్రత్యేకతల విషయానికి వస్తే..ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ పూర్తిగా డిజిటల్ ఫీచర్లతో వస్తోంది. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అలాగే వైఫై కనెక్టివిటీ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో మొబైల్ కనెక్టివిటీ సిస్టం కూడా ఉంది. ఈ యొక్క ఎలక్ట్రికల్ స్కూటర్ ఇతర స్కూటర్ల కంటే చాలా మెరుగ్గా ఉంటుంది.

ఎలక్ట్రికల్ స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఇది ఉత్తమమైన ఎంపిక అని చెప్పవచ్చు.ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ లో 3.8KWH లిథియం ఆయన్ బ్యాటరీ ఉంది. ఈ యొక్క స్కూటర్ కేవలం 43 నిమిషాల్లో ఫుల్ చార్జింగ్ అవుతుంది. అంటే ఒక్క ఛార్జ్ ద్వారా 300 కిలోమీటర్ల వరకు సులభంగా ప్రయాణించవచ్చట. ఇది గంటకు 75 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. స్కూటర్ ధర విషయానికి వస్తే ఇది ఇండియన్ మార్కెట్లో కేవలం రూ:1,11000 లక్షలు షోరూమ్ ధర ఉంది.

Tags:
Next Story
Share it