Moto Razr 50 Ultra:32ఎంపీ కెమెరాతో మోటో ఫోన్..ఫీచర్స్ ఇవే.!

ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఇందులో మోటో కంపెనీకి చెందిన మొబైల్స్ మంచి గుర్తింపు పొందాయి. ఈ కంపెనీకి చెందినటువంటి ఏ మొబైల్ అయినా సరే

Moto Razr 50 Ultra:32ఎంపీ కెమెరాతో మోటో ఫోన్..ఫీచర్స్ ఇవే.!
X

న్యూస్ లైన్ డెస్క్:ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఇందులో మోటో కంపెనీ(Moto company)కి చెందిన మొబైల్స్ మంచి గుర్తింపు పొందాయి. ఈ కంపెనీకి చెందినటువంటి ఏ మొబైల్ అయినా సరే మన్నిక విషయంలో చాలా అద్భుతంగా ఉంటుందని కస్టమర్లు నమ్ముతారు. అలాంటి మోటో నుంచి సరికొత్త మొబైల్ మోటో రేజర్ 50(Moto Razr 50 Ultra) త్వరలో ఇండియాలోకి రాబోతున్నది.

ఈ కొత్త ఫ్లిప్ ఫోన్ యొక్క ప్రత్యేకతలు ఇతర వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పటికే ఈ మోటో రేజర్ 40 అల్ట్రా మార్కెట్లోకి వచ్చి అందరినీ ఆకట్టుకుంది. ఆ ఫోన్ కు అనుగుణంగానే మోటో రేజర్ 50 అల్ట్రా (Moto Razr 50 Ultra) మార్కెట్లోకి రాబోతుంది. ఇప్పటికే ఈ ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కూడా పొందింది.అంతేకాకుండా XT2453-1 వంటి మోడల్ నెంబర్ ను కలిగి ఉంది. అయితే ఈ మొబైల్ రేజర్ 40 ఆల్ట్రా మాదిరిగానే డిజైన్ కలిగి ఉంటుందట. దీని ప్రత్యేకతల విషయానికొస్తే...ఇది క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ సిరీస్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది.

అంతేకాకుండా స్నాప్ డ్రాగన్ 8+ జనరేషన్ 1SOC తో వస్తోంది. అలాగే ఈ ఫోన్ 6.9 అంగుళాల LTPO OLED ప్రైమరీ డిస్ప్లే,3.6 అంగుళాల కవర్ స్క్రీన్ కలిగి ఉంది. ఇక ఈ మొబైల్ వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ + 13 మెగాపిక్సల్ డ్యూయల్ కెమెరా సెటప్ అలాగే ముందు భాగంలో 32 మెగాపిక్సల్ సెల్ఫీ షూటర్ కలిగి ఉంది. ఇక ఈ మొబైల్ బ్యాటరీ విషయానికొస్తే.. 3800mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇది 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే 5w వైర్లెస్ ఛార్జింగ్ సపోర్టు కలిగి ఉంటుంది. మరికొన్ని వివరాలు ఫోన్ విడుదల అయ్యేలోపు బయటకు వస్తాయని తెలుస్తోంది.

Tags:
Next Story
Share it