Tata నుంచి న్యూ కార్.. 23Km" మైలేజ్ అద్భుత ఫీచర్స్..!

ప్రస్తుతం మార్కెట్ లో టాటా కంపెనీ అంటే కస్టమర్లకు ఎంతో నమ్మకం ఉంటుంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన వాహనాలు అద్భుతం మన్నిక కలిగి ఉంటాయి. అలాంటి టాటా నుంచి

Tata నుంచి న్యూ కార్.. 23Km మైలేజ్ అద్భుత ఫీచర్స్..!
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం మార్కెట్ లో టాటా కంపెనీ అంటే కస్టమర్లకు ఎంతో నమ్మకం ఉంటుంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన వాహనాలు అద్భుతం మన్నిక కలిగి ఉంటాయి. అలాంటి టాటా నుంచి ఇప్పటికే ఎన్నో రకాల కారు వేరియంట్లు వచ్చాయి. అయితే తాజాగా ఈ కంపెనీ నుంచి మరో అద్భుత కారు చౌక ధరలో అద్భుత ఫీచర్లతో మన ముందుకు రాబోతోంది. మరి అదేంటి దాని వివరాలు చూద్దాం..

2024 ఇండియన్ మార్కెట్ లో కస్టమర్లను మెప్పించేందుకు టాటా కంపెనీ నుంచి టాటా ఆల్ట్రోజ్ అనే సరికొత్త అప్డేట్ వెర్షన్ లో న్యూ కారును విడుదల చేసింది. ఈ టాటా ఆల్ట్రోజ్ లో అద్భుత మైలేజ్ తో పాటు శక్తివంతమైన ఇంజన్ కూడా ఉంటుందట. మరి దీని యొక్క ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వాహనంలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టంతో పాటు క్రూయిజ్ కంట్రోల్, డిజిటల్ సెగ్మెంట్ ఫీచర్లను అందిస్తోంది. అంతేకాకుండా ఈ వాహనాన్ని మరింత మెరుగ్గా మార్చే ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయట.

టాటా ఆల్ట్రోజ్ కార్ మైలేజ్ విషయానికి వస్తే దీని ఇంజన్ ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ కారులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ తో పాటు 1.2 లీటర్ ఆస్పిరేటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ను కలిగి ఉంది. ఇది ఒక లీటర్ కు 23 కిలోమీటర్ల మైలేజ్ తో దూసుకుపోతోంది. ఈ వాహనం ధర విషయానికి వస్తే రూ:800000 లక్షలు గా ఉంది. మీరు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ కలిగిన కారు కావాలనుకునే వారికి ఇది అద్భుతమైన ఎంపిక అని చెప్పవచ్చు.

Tags:
Next Story
Share it