XTV : యూట్యూబ్‌కి పోటీగా ఎక్స్ టీవీ యాప్

ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ ట్విట్టర్ కంపెనీని సొంతం చేసుకున్న తర్వాత దానిలో అనేక మార్పులను తీసుకొచ్చారు.

XTV : యూట్యూబ్‌కి పోటీగా ఎక్స్ టీవీ యాప్
X

XTV : యూట్యూబ్‌కి పోటీగా ఎక్స్ టీవీ యాప్ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ ట్విట్టర్ కంపెనీని సొంతం చేసుకున్న తర్వాత దానిలో అనేక మార్పులను తీసుకొచ్చారు. ఉద్యోగుల నుంచి అన్నింటినీ ట్విట్టర్ పేరుతో సహా మార్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. ఎలోన్ మస్క్ ఇప్పటికే పాత పేరు ట్విటర్‌ను తొలగించి 'ఎక్స్'గా పేరు మార్చారు. ఇక తాజాగా ఆయన వీడియో స్ట్రీమింగ్ కోసం యూట్యూబ్‌ తరహాలో మరో ప్రత్యేక వేదికను తీసుకురాబోతున్నారు. ఎక్స్ సీఈవో లిండా యాకారినో మాట్లాడుతూ.. వినియోగదారులు హైక్వాలిటీ వీడియోలను అప్ లోడ్ చేసేందుకు వీలుగా ప్రత్యేక టీవీ యాప్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. X చిన్న స్క్రీన్ నుండి పెద్ద స్క్రీన్ వరకు ప్రతిదీ మారుస్తుంది. కొత్తగా తీసుకురానున్న టీవీ యాప్ గురించి కంపెనీ అధికారులు చెబుతున్నారు.

ఎక్స్ టీవీ యాప్ తో మీ స్మార్ట్ ఫోన్ , టీవీల్లో కొత్త తరహా కొత్త కంటెంట్ ను తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా, పెద్ద స్క్రీన్‌లపై ప్రొజెక్ట్ చేసినప్పుడు అత్యంత నాణ్యమైన కంటెంట్, లీనమయ్యే అనుభూతిని అందించేలా ఇది రూపొందించబడింది. అందుకు అనుగుణంగా యాప్‌ను సిద్ధం చేస్తున్నట్లు సీఈవో తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు. ఇవి కాకుండా, XTV యాప్ యూజర్ ఇంటర్‌ఫేస్, సంబంధిత ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయో కూడా చిన్న వీడియో రూపంలో సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

Tags:
Next Story
Share it