Telangana Bhavan : దమ్ముంటే హరీష్ రావు గారి సవాల్‌కు రేవంత్ రెడ్డి స్పందించాలి - కేటీఆర్

నేడు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

Telangana Bhavan : దమ్ముంటే హరీష్ రావు గారి సవాల్‌కు రేవంత్ రెడ్డి స్పందించాలి - కేటీఆర్
X

న్యూస్ లైన్, హైదరాబాద్: నేడు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇటీవలే హరీష్ రావు ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అలా నెరవేరిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, దమ్ముంటే సవాలు స్వీకరించమని ఒక లేఖ రాసారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ 'దమ్ముంటే హరీష్ రావు గారి సవాల్ కు రేవంత్ రెడ్డి స్పందించాలి. రేవంత్ రెడ్డి ఈసారి తన సొంత జిల్లాలో గెలవడం కూడా కోసమే. ఇచ్చిన మాట మీద నిలబడకపోవడం సీఎం రేవంత్ రెడ్డి కి బాగా అలవాటు. కొండగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. 2018 లో చిత్తు చిత్తుగా ఓడిపోయినా కూడా ఇక్కడే ఇంకా తిరుగుతున్నాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇలాగే మాట్లాడి మాట తప్పాడు. అతనికి ఇవేమి కొత్తకాదు, పైకి మేకపోతు గాంభీర్యం చూపిస్తాడు కానీ, మొత్తం డొల్లనే' అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Tags:
Next Story
Share it