Cm revanth reddy: బూతుల సీఎం

సీఎం రేవంత్ రెడ్డి .. ఈ పేరు వింటే ఠక్కున గుర్తొచ్చే విషయం ఆయన మాటతీరు. పెద్ద స్వరంతో అవతలి వారిపై మాటల దాడిని చేస్తారన్న విమర్శలను మూటగట్టుకున్నారు.

Cm revanth reddy: బూతుల సీఎం
X

మహిళా జర్నలిస్ట్ సమక్షంలో

సీఎం రేవంత్ బూతులు

థర్డ్ క్లాస్ మాటలంటూ నెట్టింట విమర్శలు

సంచలనమవుతున్న సీనియర్ జర్నలిస్ట్ బర్ఖాదత్ ట్వీట్

రేవంత్ భద్రతా సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు

నడుం పట్టి తోసేశారని ఆవేదన

నాలుగు నెలల అధికారమనే మత్తుతో వచ్చిన అహంకారమని వ్యాఖ్య

హైలెట్ బాక్స్: నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ పెద్దల మాటను పెడచెవిన పెట్టినట్టున్నారు. ఏ ఊరు వెళ్లినా, ఏ ప్రెస్ మీట్‌లో కూర్చున్నా నోరు పారేసుకోవడం ఆయనకు పరిపాటైపోయింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే ఆయన మహిళల విషయంలోనూ అడ్డూఅదుపూ లేకుండా మాట్లాడేస్తున్నారు. వెనకముందూ ఆలోచించకుండా నోరు జారేస్తున్నారు. నిన్నటి రోజున బీజేపీ నాయకురాలు, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణపై మాటల దాడితో రెచ్చిపోయిన ఆయన.. నేడు మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు అసహనాన్ని ప్రదర్శిస్తూ దురుసుగా సమాధానం ఇచ్చారు. నలుగురిలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయి.. సభ్యతకు దూరంగా మాట్లాడారు. మరోవైపు సీనియర్ జర్నలిస్ట్, యూట్యూబర్ బర్ఖాదత్ వ్యవహారంలోనూ సీఎం రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది అనుచిత ప్రవర్తన సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా బర్ఖాదత్ ఎక్స్ వేదికగా ఆవేదన వెలిబుచ్చడంతో తీవ్ర చర్చనీయాంశమైంది.

తెలంగాణం, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి .. ఈ పేరు వింటే ఠక్కున గుర్తొచ్చే విషయం ఆయన మాటతీరు. పెద్ద స్వరంతో అవతలి వారిపై మాటల దాడిని చేస్తారన్న విమర్శలను మూటగట్టుకున్నారు. హోదా, గౌరవం అన్నిటినీ పక్కన పెట్టి నోటితో రెచ్చిపోవడమే అజెండాగా అధికారంలోకి వచ్చినట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. శనివారం నాటి ప్రెస్ మీట్‌లో మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం.. ఆయన మాట తీరుపై మరోసారి చర్చకు దారితీసింది. మహిళా జర్నలిస్టుతో ఆయన మాట్లాడిన మాటలు సీఎం హోదాకు తగినవా అన్న చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ‘‘ఆయన ప్యాంట్ ఎందుకు వేసుకున్నాడమ్మా.. డ్రాయర్ మీద ఎందుకు తిరగుతలేడు. ఇట్లాంటి తిక్క మాటలకు తలతిక్క సమాధానాలు తప్ప మరేమైనా ఉన్నదా?’’ అంటూ రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ థర్డ్ క్లాస్ మాటలేంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ మహిళతో మాట్లాడే మాటలేనా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇక సీనియర్ జర్నలిస్ట్, యూట్యూబర్ బర్ఖాదత్ చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బందిపై సీనియర్ జర్నలిస్ట్ బర్ఖాదత్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎక్స్ వేదికగా తనకు జరిగిన అవమానాన్ని ఆమె ప్రస్తావించారు. సీఎం సెక్యురిటీ తనను నడుం పట్టి తోసేశారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు తోసేయడంతో తమ చేతుల్లోని ఎక్విప్‌మెంట్ కూడా పడిపోయిందన్నారు. ప్రజాజీవితాల్లో ఉండే వారితో మాట్లాడటం, ప్రశ్నించడం అనేది జర్నలిస్టులుగా తమ హక్కని ఆమె తెలిపారు. అధికార మత్తు వల్ల సీఎం రేవంత్ రెడ్డికి నాలుగు నెలల్లో వచ్చిన అహంకారం ఇదంటూ మండిపడ్డారు. బర్ఖాదత్ ట్వీట్ నెట్టింట్ వైరల్ అయ్యింది. నేరుగా రేవంత్ రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. బర్ఖాదత్ ట్వీట్‌పై అధికార కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రధాన మీడియాలోనూ దీనిపై చర్చ కూడా లేదు. అసలేం జరిగిందని విచారించిన వారు లేరు.

సీఎం రేవంత్ రెడ్డి నోటి దురుసుతో ఒక మహిళా జర్నలిస్టు బాధపడితే, ఆయన భద్రతా సిబ్బంది తీరుతో మరో జర్నలిస్ట్ ఇబ్బంది పడ్డారు. మహిళల పట్ల రేవంత్ సర్కార్ వ్యవహరించే తీరు ఇదేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మహిళలకు రేవంత్ రెడ్డి ఇచ్చే గౌరవం ఇలాగే ఉంటుందా అని నిలదీస్తున్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడటం అంటే ఫ్యాషన్ అన్న తరహాలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన పదవిలో ఉండి ఆయన మాట్లాడతున్న విధానం పిల్లలపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు సంయమనం కోల్పోతున్నారని, ఆయన ఆవేశంగా మాట్లాడే మాటలతో ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు.

Tags:
Next Story
Share it