Telangana: రేవంత్ పాలనలో..మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలో (Telangana) రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. రేవంత్ రెడ్డి ( ప్రభుత్వం వచ్చిన తర్వాత.. రైతన్నలు ఆగమవుతున్నారు. రైతు బంధు తో పాటు సాగునీరు అందక.

Telangana: రేవంత్ పాలనలో..మరో  ఇద్దరు రైతుల ఆత్మహత్య
X

Telangana: తెలంగాణ రాష్ట్రంలో (Telangana) రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. రేవంత్ రెడ్డి ( ప్రభుత్వం వచ్చిన తర్వాత.. రైతన్నలు ఆగమవుతున్నారు. రైతు బంధు తో పాటు సాగునీరు అందక... నాన కష్టాలు పడుతున్నారు. ఈ తరుణం లోనే చాలా మంది రైతులు... ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే 200లకు పైగా రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు.

అయితే జనగామ జిల్లా (janagoan) తరిగొప్పుల మండలం సోలి పురానికి చెందిన రైతు శ్రీనివాస్ (Srinivas) తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు ఎకరాలలో వేసిన వరి పంట.. ఘోరంగా ఎండిపోయింది. నాలుగు బోర్లు వేసిన కూడా ఫలితం రాలేదు. దీంతో అప్పులు పెరిగిపోయి... జనగామ జిల్లాకు చెందిన శ్రీనివాస్ (Srinivas) చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

మరోవైపు వికారాబాద్ జిల్లాలో (vikarabad) మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ జిల్లా నాగారం గ్రామానికి చెందిన అనంతయ్య అనే రైతు రెండు ఎకరాలలో మక్కా సాగు చేశాడు. అలాగే అద్ద ఎకరం లో వరి పంట సాగు చేశాడు. అయితే ఇవన్నీ పంటలు ఎండిపోయాయి. అటు అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ తరుణంలో అనంతయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు సంఘటనలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో... హాట్ టాపిక్ గా మారాయి. మరి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:
Next Story
Share it