Congress: బస్తీ దవాఖానాలో బీరు సీసాలు..!

గత మూడు నెలలుగా బస్తీ దవాఖానాల్లో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆసుపత్రి అంటే శుభ్రతకు మారుపేరు

Congress: బస్తీ దవాఖానాలో బీరు సీసాలు..!
X

చెత్తాచెదారంతో అస్తవ్యస్తంగా ఆసుపత్రులు

చాలా హాస్పిటళ్లలో రెండు నెలలుగా లేని డాక్టర్లు

డాక్టర్లు లేకపోవడంతో ట్రీట్మెంట్ చేస్తున్న స్టాఫ్ నర్సులు

స్టాఫ్ నర్సులకు రెండు నెలలుగా లేని జీతాలు

చాలా బస్తీ దవాఖానాల్లో లేని మంచినీళ్లు

న్యూస్ లైన్ తెలుగు/తెలంగాణం పరిశీలనలో..

వెలుగులోకి వచ్చిన వాస్తవాలు

హైలెట్ బాక్స్: నిరుపేదలకు ఉచిత వైద్యం అందించాలని, వారి చెంతకే వైద్య సేవలను తీసుకొచ్చింది గత ప్రభుత్వం. బస్తీలలో ఏర్పాటు చేసిన దవాఖానాలకు సిబ్బందిని, సరిపడా మందులను అందుబాటులో ఉంచి, మెరుగైన సేవలను అందించాలనే సత్సంకల్పం నాటి ప్రభుత్వానిది. గత బీఆర్ఎస్ పాలన ముగిసి కొత్త ప్రభుత్వం ఏలుబడిలోకి తెలంగాణ వచ్చింది. మరి నాటి ప్రమాణాలతో, మరింత మెరుగ్గా నేడు బస్తీ దవాఖానాలు ఉన్నాయా? సరిపడా సిబ్బంది, మెడిసిన్ ఆస్పత్రులలో ఉంటున్నాయా? అసలు అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి? దీనిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది న్యూస్ లైన్ తెలుగు/తెలంగాణం. దీనిలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని బస్తీ దవాఖానాను పరిశీలించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తెలంగాణం, హైదరాబాద్: గత మూడు నెలలుగా బస్తీ దవాఖానాల్లో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆసుపత్రి అంటే శుభ్రతకు మారుపేరు. అయితే అదే ఇక్కడ కొరవడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. బస్తీ దవాఖానాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని.. ఆర్కేపురం డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ ఫేజ్ 2 బస్తీదవాఖానాను పరిశీలించినప్పుడు మా కంట పడింది. పేరుకుపోయిన చెత్తాచెదారంతో హాస్పిటల్ కంపుకొడుతోంది. దుర్గంధంతో హాస్పిటల్ కు వచ్చే పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. ఎన్టీఆర్ నగర్ బస్తీ దవాఖానాలో ఏకంగా ఖాళీ బీరుసీసాలు దర్శనమిచ్చాయి. సిబ్బంది కొరత వైద్య సేవలకు మరో అవరోధంగా మారింది. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని స్థానికులు అంటున్నారు. కొన్ని హాస్పిటల్స్ లో డాక్టర్లే లేరు. దీంతో స్టాఫ్ నర్సులే డాక్టర్లై సేవలందిస్తున్నారు. పూర్తిస్థాయిలో సిబ్బంది ఉంటే పేదలకు మరింతగా అందుబాటులోకి బస్తీ దవాఖానాలు వస్తాయని అంటున్నారు. పేదలకు వైద్య సేవలను దూరం చేసే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మండిపడుతున్నారు. రాజకీయాలను పక్కన పెట్టి బస్తీ దవాఖానాల్లో సౌలత్‌లను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. స్టాఫ్ నర్సులకు రెండు నెలలుగా జీతాలు లేవు. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆందోళన వ్యక్తంచేశారు. అప్పోసొప్పో చేసి కుటుంబాన్ని నడుపుకుంటున్నామని వారు అంటున్నారు. ఇల్లు నడవాలంటే పని చేయక తప్పదని, కానీ నెలంతా పని చేసినా జీతం రాకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇక కొన్ని హస్పిటల్స్‌లో డాక్టర్లు కరువు, మరికొన్ని హస్పిటల్స్ లో సపోర్ట్ స్టాఫ్ లేకపోవడం, ఇంకొన్నింటిలో మెడిసిన్స్ లేకపోవడం, గత మూడు నెలలుగా అందని సిబ్బందికి జీతాలు. అధికారులు నిర్లక్ష్యంతోనే మరుగున పడుతున్న బస్తీ దవాఖానాల్లోని వైద్యం. డాక్టర్ పనులను స్టాఫ్ నర్స్ చేయడంతో స్టాఫ్ నర్స్ పై పనిభారం పడుతోంది. డాక్టర్లు లేకపోవడంతో వైద్య సేవలను నమ్మని పబ్లిక్.

గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం కోసం బస్తీ దవాఖానాల ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 10 వేల మందికి ఒక దవాఖానా చొప్పున బస్తీ దవాఖానాలను దశల వారీగా ప్రారంభించారు. బస్తీ దవాఖానాలలో ఒక డాక్టర్, ఒక స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాఫ్‌తో పాటు మందులు, రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్తీదవాఖానాల పనివేళాలు. 57 రకాల వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 360కి పైగా బస్తీ దవాఖానాలు ఉన్నాయి.

Tags:
Next Story
Share it