L Ramana: చేనేతల ఆకలి చావులకు రేవంత్, తుమ్మలే కారణం !

చేనేతల ఆకలి చావులకు రేవంత్, తుమ్మలే కారణం అంటూ ఆగ్రహించారు బీఆర్ఎస్‌ పార్టీ (BRS) ఎమ్మెల్సీ ఎల్ రమణ (L Ramana). తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీ ఎల్

L Ramana: చేనేతల ఆకలి చావులకు రేవంత్, తుమ్మలే కారణం !
X

L Ramana: చేనేతల ఆకలి చావులకు రేవంత్, తుమ్మలే కారణం అంటూ ఆగ్రహించారు బీఆర్ఎస్‌ పార్టీ (BRS) ఎమ్మెల్సీ ఎల్ రమణ (L Ramana). తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీ ఎల్ రమణ మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్న లకు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చిందని... కాంగ్రెస్ ప్రభుత్వంలో నేత కార్మికులు మళ్లీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ కారణమని ఫైర్‌ అయ్యారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వస్త్ర పరిశ్రమపై వున్న జీఎస్టీ ఎత్తివేస్తామని చెప్పారు.... చేనేత కార్మికుల కుటుంబాలకు కేసీఆర్ సీఎంగా వున్నప్పుడు ప్రతి కుటుంబానికి 50 వేల రూపాయలు రుణం ఇచ్చారని వెల్లడించారు బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎల్ రమణ (L Ramana). . దసరా బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు ఇవ్వడం ద్వారా చేనేతలకు అండగా నిలబడ్డారని తెలిపారు. చేనేతలకు నెలకు 2 వేల రూపాయల పింఛన్ ఇచ్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని కొనియాడారు ఎమ్మెల్సీ ఎల్ రమణ.

గత నవంబర్ నుండి దాదాపు పది వేల మందికి పని లేకుండా పోయిందని.. ఎమ్మెల్సీగా నేను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి చేనేతల సమస్యలను తీసుకువెళ్ళానని వివరించారు. చేతి వృత్తులను కాపాడలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ వుంది....అటు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని తెలిపారు ఎమ్మెల్సీ ఎల్ రమణ. ఆత్మహత్యలు జరిగాక కాంగ్రెస్ నేతలు పరామర్శలకు వెళుతున్నారు...దేవుళ్ళ మీద ప్రమాణాలు చేస్తూ ఓట్లు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారన్నారు ఎమ్మెల్సీ ఎల్ రమణ (L Ramana).

Tags:
Next Story
Share it