Nalgonda: నల్గొండ ట్రాఫిక్ ​పీఎస్​కు తాళం!

నల్గొండ జిల్లా కేంద్రంలో వింత ఘటన చోటుచేసుకుంది నల్గొండ జిల్లాలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తాళం వేశారు. దాదాపు 40 నిమిషాల పాటు శనివారం

Nalgonda: నల్గొండ ట్రాఫిక్ ​పీఎస్​కు తాళం!
X

Nalgonda: నల్గొండ జిల్లా కేంద్రంలో వింత ఘటన చోటుచేసుకుంది నల్గొండ జిల్లాలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తాళం వేశారు. దాదాపు 40 నిమిషాల పాటు శనివారం రోజున నల్గొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తాళం చేశారు. అయితే ఎవరో ఒకరు నిరసన చేయడం వల్ల ఇది జరగలేదు. సిబ్బంది లేక ఈ సంఘటన చోటుచేసుకుంది. వాస్తవానికి ఈ పోలీస్ స్టేషన్ లో 25 నుంచి 30 మంది సిబ్బంది ఉంటారు. అయితే ఇందులో నలుగురు డిప్యూటేషన్ పైన వేరే చోటుకు వెళ్లారు.

ఇక మరో 15 నుంచి 20 మంది ఎన్నికల డ్యూటీల కోసం బిజీ అయిపోయారు. ఎన్నికల డ్యూటీలో భాగంగా వేరే ప్రాంతాలకు వెళ్లారు. మరో సుమారు 10 మందికి చౌరస్తాల వద్ద డ్యూటీ వేశారు ఉన్నతాధికారులు. సీఐ అలాగే ఎస్ఐలతో పాటు మిగిలిన కొంత మంది హైకోర్టు చీఫ్ జస్టిస్, జిల్లా కోర్టుల సముదాయం ప్రారంభానికి రావడంతో కొంతమంది అక్కడికి డ్యూటీ కి వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. సిబ్బంది లేకుండా పోయింది. దీంతో ఆ పోలీస్ స్టేషన్కు తాళం వేశారు అధికారులు. సుమారు 45 నిమిషాల పాటు బందు చేశారు.

Tags:
Next Story
Share it