Revanth- Adani: దేశంలోనే అతిపెద్ద స్కామ్?

సింగరేణిపై రేవంత్ సర్కార్ కుట్రలకు పాల్పడుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది.

Revanth- Adani: దేశంలోనే అతిపెద్ద స్కామ్?
X

సింగరేణిని ప్రైవేట్ పరం చేసే భారీ కుట్ర

అదానీతో సీఎం రేవంత్ రెడ్డి డీల్..!

10శాతం కమీషన్, 3 శాతం లోకల్ ఎమ్మెల్యేలకు..

ఇచ్చేందుకు ఒప్పందం జరిగిందని ప్రచారం?

జూన్ 17న దావోస్‌లో బీజం పడిందని టాక్

ఆందోళనలో సింగరేణి కార్మికలోకం

తెలంగాణం, స్పెషల్ డెస్క్: సింగరేణిపై రేవంత్ సర్కార్ కుట్రలకు పాల్పడుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. కార్మికులను నమ్మించి గొంతుకోసేలా పథక రచన చేస్తున్నట్టు తెలుస్తోంది. వేల మంది కార్మికుల శ్రమజీవన సౌందర్యానికి ప్రతీకగా.. తెలంగాణ ప్రగతికి తోడుగా నిలిచే సింగరేణిని ప్రైవేటుపరం చేయడానికి రేవంత్ రెడ్డి అండ్ కో తీవ్రంగా ప్రయత్నిస్తుందన్న ప్రచారం బలంగా జరుగుతోంది. దీంతో యావత్ సింగరేణి కుటుంబం ఆందోళనకు గురవుతోంది. అంతేగాక వందేళ్లకు సరిపడా నిల్వలతో, నాణ్యమైన బొగ్గును సరఫరా చేస్తున్న సింగరేణిని కాదని, బయట నుంచి బొగ్గు కొనుగోలు చేయడానికి అదానీతో రేవంత్ రెడ్డి చేతులు కలిపారని సమాచారం. దీనికి ఈ ఏడాది జనవరి 17న తొలి అడుగుపడిందని తెలుస్తోంది. నాటి దావోస్ పర్యటనలో గౌతమ్ అదానీతో సీఎం రేవంత్ రెడ్డి డీల్ కుదుర్చుకున్నారని, ఈ మేరకు మిర్యాలగూడ పవర్ ప్లాంట్‌కు విదేశీ బొగ్గును కొనుగోలు చేసుకునేలా తద్వారా ప్రణాళికలు సిద్ధం చేశారని సమాచారం. సింగరేణిలో టన్నుకు రూ. 4000లు మాత్రమే ఉండగా, విదేశాల నుంచి బొగ్గు సరఫరా చేసుకుంటే టన్నుకు రూ.25,000 లు ఇవ్వాల్సి వస్తుంది. దీనికి గాను రేవంత్ రెడ్డికి 10శాతం కమిషన్ కాగా, మంత్రి, బడా కాంట్రాక్టర్ శ్రీనివాస రెడ్డికి, లోకల్ ఎమ్మెల్యేలు గడ్డం వివేకానంద, ఆయన సోదరుడు గడ్డం వినోద్‌లకు 3 శాతం ఇచ్చేలా ఒప్పందం జరిగిందని ప్రచారం. అయితే గత బీఆర్ఎస్ హయాంలో కేంద్రం ఈ విధమైన ప్రతిపాదనలు తీసుకురాగా నాటి సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో అప్పటికి ఆ ప్రయత్నాలకు విరామం ప్రకటించగా.. తాజాగా ప్రభుత్వం మారగానే రేవంత్ రెడ్డితో మంతనాలు జరిపారు. దీనిలో భాగంగానే దావోస్‌లో చర్చలు అనంతరం రాష్ట్రానికి అదానీ తనయుడు రావడం చకచకా జరిగిపోయాయని అంటున్నారు. బయటకు రాష్ట్రానికి పెట్టుబడులు అంటూనే.. గుట్టు చప్పుడు కాకుండా లోలోన జరగాల్సినదంతా జరిగిపోయిందని ప్రచారం జరుగుతోంది.

అంతేకాకుండా సింగరేణి గనులను ప్రైవేట్ వాళ్ల చేతుల్లో పెట్టడానికి మెల్లమెల్లగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది. అదానీ చేతుల్లో పెట్టేలా ప్రణాళికలు కూడా రెడీ అయినట్టుగా జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముహూర్తం ఫిక్స్ చేశారని, జూన్ 15లోగా సింగరేణిని ప్రైవేట్‌పరం చేసేస్తారని కూడా అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ ఇది కానుంది. తాజా ప్రచారంతో సింగరేణి వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. కార్మిక లోకంలో ఆందోళన నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:
Next Story
Share it