Veerappan:వీరప్పన్ మరణం వెనుక అసలు నిజాలు ఇవేనా..?

గంధపు చెక్కల స్మగ్లింగ్ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది వీరప్పన్..ఈయన పేరు వినడమే కానీ రియల్ గా చూసింది ఎవరూ లేరు. వీరప్పన్ కు సంబంధించి ఒకే ఒక ఫోటో

Veerappan:వీరప్పన్ మరణం వెనుక అసలు నిజాలు ఇవేనా..?
X

న్యూస్ లైన్ డెస్క్: గంధపు చెక్కల స్మగ్లింగ్ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది వీరప్పన్..ఈయన పేరు వినడమే కానీ రియల్ గా చూసింది ఎవరూ లేరు. వీరప్పన్ కు సంబంధించి ఒకే ఒక ఫోటో బయట చెక్కర్లు కొడుతూ ఉంటుంది. బక్కపలచని దేహం పెద్ద పెద్ద మీసాలు. ఇది తప్ప వీరప్పన్ గురించి మరో విషయం తెలియదు. అలాంటి వీరప్పన్ పేదవారిని హింసించి వారిపై డబ్బులు సంపాదించలేదు. ప్రస్తుత రాజకీయ నాయకుల్లాగా పైకి తెల్ల బట్టలు వేసుకొని కోటాను కోట్లు వెనకేసుకోలేదు.

వీరప్పన్ కేవలం అడవిలోనే ఉంటూ గంధపు చెక్కల స్మగ్లింగ్ చేసేవాడనే ఒక ఆరోపణ ఉంది. అలాంటి వీరప్పన్ దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు పోలీసులకు చుక్కలు చూపించారు. కానీ చివరికి పోలీసుల చేతిలోనే హతమయ్యారు. కానీ ఆయన ఎలా మరణించారు అనేది ఇప్పటికి కూడా మిస్టరీగానే ఉంది. అలాంటి వీరప్పన్ మరణం గురించి కొన్ని విషయాలు చూద్దాం.. వీరప్పన్ ఆరోగ్యంగా ఉన్నన్ని రోజులు ఆయనను ఏ పోలీసు ఏ ప్రభుత్వం ఏమి చేయలేదు. ఆయన వయసు మీద పడ్డ తర్వాత కళ్ళు కనిపించని సమయంలో దాడి చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

వీరప్పన్ మృతిపై 2017 లో ఐపీఎస్ విజయ్ కుమార్ రాసిన చేంజింగ్ ద బ్రిగేడ్ అనే పుస్తకం ద్వారా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అయితే ఆపరేషన్ కుకున్ ద్వారా వీరప్పన్ ను మట్టి కల్పించారట. కంటి సమస్యతో బాధపడుతున్న వీరప్పన్ చికిత్స పొందడం కోసం LTTE లో చేరెందుకు శ్రీలంక వెళ్తున్నారని తెలుసుకొని విజయ్ కుమార్, సెంతమరై కన్నన్లు ఈ అవకాశాన్ని అనుకూలంగా తీసుకొని వ్యూహం రచించి ఆపరేషన్ కుకింగ్ అనే ప్రణాళిక ద్వారా ఆయనను పట్టుకున్నట్టు తెలియజేశారు. కానీ ఎలా చంపారు అనేది ఇప్పటికి మిస్టరీగానే మారింది.

Tags:
Next Story
Share it