4వేల ఏండ్ల నుంచే ఈ కర్రీ తింటున్నారా..?

కోటి విద్యలు కూటి కోసమే అన్నారు పెద్దలు. మనం ఎంత పని చేసినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత బంగారం మన దగ్గర ఉన్న వాటిని మనం తినలేము. మనం బ్రతకాలంటే

4వేల ఏండ్ల నుంచే ఈ కర్రీ తింటున్నారా..?
X

న్యూస్ లైన్ డెస్క్:కోటి విద్యలు కూటి కోసమే అన్నారు పెద్దలు. మనం ఎంత పని చేసినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత బంగారం మన దగ్గర ఉన్న వాటిని మనం తినలేము. మనం బ్రతకాలంటే తప్పనిసరిగా ఆహారం తినాల్సిందే. మానవ పుట్టుక మొదలైనప్పుడు ముందుగా స్టార్ట్ చేసింది ఆహారం వేటనే. అలా ఆదిమానవులు ఆహారాన్ని సృష్టించుకుంటూ రకరకాల పంటలను కూడా పండించడం నేర్చుకున్నారు. అలా సృష్టిలో మానవులు ఎన్నో రకాల ఆహార పదార్థాలను తింటున్నారు. అంతేకాకుండా రోజుకు ఒక రకం వెరైటీ వంటకాలను కూడా తయారు చేస్తున్నారు.

ఇవన్నీ వస్తున్నా కానీ గత నాలుగువేల సంవత్సరాల నుంచి ఈ ఒక్క ఆహార పదార్ధం మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుందట. మరి ఆ పదార్థం ఏంటి అనే వివరాలు చూద్దాం. ఈ ఆహార పదార్థం పేరు గుత్తి వంకాయ. దీన్ని బైంగన్ కురా అని కూడా అంటారు. ఈ కర్రీ వండడానికి అల్లం, పసుపు, ఉల్లిపాయ, ఇలా అన్ని రకాల మసాలాలు దట్టించి కూరను వేల సంవత్సరాల నుంచే మన ఇండియన్స్ తింటూ వస్తున్నారట. ఇదే విషయాన్ని ప్రముఖ చెప్ కునాల్ కపూర్ తెలియజేశారు. హర్యానాలోని పరమాన ప్రాంతంలో హరప్పా నాగరికత ఆనవాళ్లు కొన్ని లభించాయి.

https://www.instagram.com/reel/C24RBeDrW_0/?utm_source=ig_web_copy_link

అక్కడ స్మశాన వాటికలో తవ్వకాలు జరిపినప్పుడు ఒక మట్టి కుండ కనిపించిందట. దాన్ని ప్రయోగశాలలో పరీక్షిస్తే వంకాయ అవశేషాలు అల్లం, వెల్లుల్లి, పసుపు వంటి అవశేషాలు కూడా కనిపించాయట. దీన్ని పట్టి చూస్తే మాత్రం 4000 వేల క్రితమే వంకాయ కూరను వండుతూ వస్తున్నారని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మాత్రం ప్రపంచంలోని అత్యంత పురాతనమైన కర్రీగా మన గుత్తి వంకాయ అని చెప్పుకొచ్చారు. చాలామంది ఇండ్లలో ఈ గుత్తి వంకాయ కర్రీని వండుకొని హ్యాపీగా తింటూ ఉంటారు. ఇది చాలా తక్కువ ధరలో పేదవాడికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది.

Tags:
Next Story
Share it