Supreme Court: భార్య కట్నకానుకలపై భర్తకు ఆ హక్కు ఉండదట.!

సాధారణంగా మన ఇండియాలో పెళ్లిళ్లు అంటే వధువు తరఫున వారు వరుడికి కట్నాలు, కానుకలు ఇస్తూ ఉంటారు. కొంతమంది బంగారం రూపంలో కట్న కానుకలు ఇస్తే మరి కొంతమంది భూములు,

Supreme Court: భార్య కట్నకానుకలపై భర్తకు ఆ హక్కు ఉండదట.!
X

న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా మన ఇండియా(India) లో పెళ్లిళ్లు అంటే వధువు తరఫున వారు వరుడికి కట్నాలు, కానుకలు ఇస్తూ ఉంటారు. కొంతమంది బంగారం రూపంలో కట్న కానుకలు ఇస్తే మరి కొంతమంది భూములు, డబ్బులు ఇస్తూ ఉంటారు. అయితే అలా వచ్చిన కట్నాన్ని భర్త తన సొంత ఆస్తిగా భావించి వాటిని వారికి ఇష్టం వచ్చిన దానికి ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే భార్య తరపున వచ్చినటువంటి కట్నానికి సంబంధించి భర్తకు ఎలాంటి హక్కు ఉండదట. అవసరానికి వాడుకొని మళ్ళీ ఆమెది ఆమెకి ఇచ్చేయాలని,దానిపై పూర్తి హక్కులు భార్యకే ఉంటాయని సుప్రీంకోర్టు(Supreme Court) తాజాగా తీర్పునిచ్చింది.

తాజాగా కోర్టులోకి వచ్చిన ఒక కేసు విషయమై పూర్వపరాలాన్ని పరిశీలించి ఈ తీర్పును ఇచ్చిందట సుప్రీంకోర్టు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళ (Kerala) రాష్ట్రానికి చెందిన ఓ మహిళకు వివాహ సమయంలో తమ పుట్టింటి వారు 89 గ్రాముల బంగారాన్ని కానుకగా ఇచ్చారు. అయితే భర్త తన అవసరాల కోసం మహిళ తీసుకువచ్చిన బంగారాన్ని వాడుకున్నారు. అయితే తన పెళ్లయిన మరుసటిరోజే బంగారం తీసుకొని తన తల్లికి అందజేశాడని, తల్లికి ఎందుకు ఇస్తున్నావు అని అడిగితే జాగ్రత్తపరచడానికి ఇస్తున్నానని భర్త చెప్పాడట. అయితే ఎన్ని రోజులైనా ఆ బంగారం(Gold) మళ్ళీ తీసుకు రమ్మని చెబితే తీసుకురాకుండా బుకాయిస్తున్నాడట. అయితే అత్తింటి వారు ఆ వచ్చిన బంగారాన్ని అమ్మి అప్పులన్నీ తీర్చుకున్నారని ఆమెకి తర్వాత తెలిసింది. తన సొమ్ము అడిగితే భర్త(Husband) బెదిరిస్తూ వస్తున్నాడని చివరికి 2011లో కుటుంబ న్యాయస్థానాన్ని ఆమె ఆశ్రయించిందట.

ఇంట్లో భర్త చేసింది తప్పే అంటూ ఫ్యామిలీ కోర్టు(Family court) తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ భర్త హైకోర్టు మెట్లు ఎక్కాడు. భర్తకు అనుకూలంగా తీర్పు రావడంతో భార్య(Wife) సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజీవ్ కన్నా (Sanjeev kanna) దిపంకర్ దత్తతో కూడిన ధర్మాసనం పూర్తిగా విచారించి తీర్పు వెలువరించింది. దీంతో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసి వధువు తెచ్చిన కట్నం ఉమ్మడి ఆస్తి ఆమెకే చెందుతుందని భర్త కానీ అతని కుటుంబ సభ్యులు కానీ అవసరాలకు వాడుకొని మళ్ళీ ఆమె సోమ్ము ఆమెకి ఇచ్చేయాలి తప్ప పూర్తిగా వాడేసుకోవడానికి హక్కు లేదని స్పష్టం చేసింది. చివరికి తన బంగారం విలువైనటువంటి 6లక్షల రూపాయలు చెల్లించాలని ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.

Tags:
Next Story
Share it