Driver: ఆటో డ్రైవర్ అందమైన భార్య..అలా చేసిందేంటి.?

భార్యాభర్తల జీవితమనేది ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగి ఉంటేనే ముందుకు సాగుతుంది. ఇందులో ఎవరికి వక్రబుద్ధి కలిగినా జీవితంలో కలతలు తప్పవు. వీరి మధ్య కలతలు ఏర్పడితే

Driver: ఆటో డ్రైవర్ అందమైన భార్య..అలా చేసిందేంటి.?
X

న్యూస్ లైన్ డెస్క్: భార్యాభర్తల (Husband wife) జీవితమనేది ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగి ఉంటేనే ముందుకు సాగుతుంది. ఇందులో ఎవరికి వక్రబుద్ధి కలిగినా జీవితంలో కలతలు తప్పవు. వీరి మధ్య కలతలు ఏర్పడితే ఇది కేవలం వీరిపైనే కాకుండా ఇరు కుటుంబాలపై పడి ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. అలాంటి భార్యాభర్తలు ఉన్నంతలో ఎంత సర్దుకుని బ్రతికితే అంత ఆనందం. ఒకరిపై ఒకరికి మంచి నమ్మకంతో మెదలాలి. ఎవరు రాంగ్ స్టెప్ వేసినా వారి జీవితం బుగ్గిపాలే. రాజమండ్రి(Rajamandri) కి చెందిన బాలు అనే వ్యక్తి ఆటో డ్రైవర్(Auto Driver). ఆయనకు గత రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది.

ఆవిడ పేరు కవిత(Kavitha) . ఎంతో అందంగా ఇన్నోసెంట్ గా ఉంటుంది. అలాగే డిగ్రీ కూడా పూర్తి చేసింది. బాలు, కవితల వివాహం అంగరంగ వైభవంగా చేశారు తల్లిదండ్రులు. అయితే బాలు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆటో నడుపుతూ బాగా సంపాదిస్తారు. అలా వచ్చిన డబ్బంతా తన భార్య దగ్గర పెడతాడు. అలా సంసారం ముందుకు సాగుతోంది. కొన్ని నెలలు గడిచింది. బాలు రోజు ఆటో నడుపుతూ వచ్చిన డబ్బులను ఆమెకిస్తూ ఇంట్లో కావలసినటువంటి వస్తువులు తీసుకొస్తూ వీరిద్దరూ హ్యాపీగా గడుపుతున్నారు. కానీ కవిత బుద్ధి వక్రమార్గంలోకి వెళ్ళింది. పెళ్లయి కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆమె మరో వ్యక్తితో సంబంధాన్ని పెట్టుకుంది. ఆయన తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్.బాలు (Balu) ఆటో తీసుకొని బయటకు వెళ్ళగానే అతనికి ఫోన్ చేసేది.

అలా బాలు వచ్చే సమయం వరకు వీరిద్దరూ ఎంజాయ్ చేసేవారు. అలా వీరి వ్యవహారం సాగుతున్న తరుణంలో, కవిత(Kavitha) తన బాయ్ ఫ్రెండ్ తో కలవడమే కాకుండా అతనికి తోడుగా వచ్చిన మరో వ్యక్తితో కూడా సంబంధం పెట్టుకుంది. ఇలా భర్తకు తెలియకుండా మెయింటైన్ చేస్తూ వస్తోంది. అయితే ఒక రోజు బాలు మార్నింగ్ టైంలో ఆటో నడపడానికి వెళ్లలేదు. కవిత ఆయనతో కాస్త గొడవ పెట్టుకుని సాయంకాల సమయంలో ఆటో నడిపించడానికి పంపింది. ఆయన బయటకు వెళ్లగానే తన బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసింది. ఆయన నాలుగు గంటల సమయంలో వచ్చి నైట్ ఎనిమిది గంటల వరకు ఆమెతో గడిపారు. ఇదే క్రమంలో బాలు ఆ గల్లీలోకి ఆటో తీసుకొని వచ్చాడు. అయితే కవిత బాయ్ ఫ్రెండ్ అదే ఆటోను ఆపి తను వెళ్లవలసిన ప్రదేశం పేరు చెప్పాడు.

అలా ఆటో (Auto) వెళుతూ ఉన్న క్రమంలో ఆయన మరో ఫ్రెండ్ కు కాల్ చేసి మామ ఈరోజు చాలా ఎంజాయ్ చేశాను. మనం పార్టీ చేసుకుందాం. ఈరోజు కవిత చాలా అందంగా ఉంది రా అంటూ ఫోన్ లో మాట్లాడాడు. ఇది విన్న బాలుకు అనుమానం వచ్చింది. ఆ వ్యక్తిని తను వెళ్లవలసిన స్థలంలో దించి ఇంటికి వచ్చాడు. అప్పటికే కవిత చాలా టైడ్ అయిపోయి తాను పెట్టుకున్న పూలన్నీ చెదిరిపోయి ఉన్నాయి. వెంటనే బాలు(Balu) ఆమె ఫోన్ తీసుకొని చూసి, గట్టిగా మందలించాడు. నాలుగు దెబ్బలు వేశాడు. దీంతో ఆమె ఏడ్చుకుంటూ కాళ్లపై పడి తప్పు చేశానండి నన్ను క్షమించండి అంటూ ముసలి కన్నీరు కార్చింది. కానీ బాలు భార్య మీద ఉన్న ప్రేమతో ఆమెను ఏమీ చేయలేక తాగుడుకు బానిస అయ్యాడు. ఈ విధంగా అమ్మాయి వల్ల హ్యాపీగా పని చేసుకునే వ్యక్తి ఆగమైపోయాడని చెప్పవచ్చు. దీనిపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.

Tags:
Next Story
Share it