VIRAL: భార్యా బాధితురాలా చూశారా..విన్నారా..భర్త కోసం ఈ భార్య ఏంచేసిందో

ఎంతసేపు భార్య మీద పడి ఏడుస్తారు ఈ మగవాళ్లు...షాజహాన్ తాజ్ మహాల్ కట్టాడు ...మగవాళ్లే అన్ని చేశారు. ఆడపురుగు కూడా మగవారి కోసం ఏం చెయ్యదని వెక్కిరించారు

VIRAL: భార్యా బాధితురాలా చూశారా..విన్నారా..భర్త కోసం ఈ భార్య ఏంచేసిందో
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఎంతసేపు భార్య మీద పడి ఏడుస్తారు ఈ మగవాళ్లు...షాజహాన్ తాజ్ మహాల్ కట్టాడు ...మగవాళ్లే అన్ని చేశారు. ఆడపురుగు కూడా మగవారి కోసం ఏం చెయ్యదని వెక్కిరించారు. మాకు ప్రేమ ఉందని ...భర్త కోసం మేం కూడా ఏమైనా చేయగలమని నిరూపించింది ఓ అక్క, మగాడి కోసం ఏ బిల్డింగు కట్టదని కూసిన గాడిదలందరి నోరు మూయిస్తూ తన భర్త కు ప్రేమతో ఓ గుడి కట్టింది.

మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి( PARVATHA GIRI) శివారు సోమ్లాతండాకు చెందిన కల్యాణి-బానోతు ( KALYANI BANOTHU) హరిబాబుకు( HARI BABU) 27 ఏళ్ల క్రితం వివాహమైంది. సంతానం లేకున్నా ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవించారు. హరిబాబు మూడేళ్ల క్రితం కరోనాతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఒంటరి అయిన ఆమె మానసికంగా కుంగిపోయారు. ఇన్నాళ్లు తోడుగా ఉన్న స్నేహితుడు( FRIEND) లేకపోవడంతో చీకటితో కష్టం చెప్పుకొని బతికింది. ఇక తన భర్త రూపు తనతో ఉండాలని 20 లక్షలు ఖర్చు చేసి భర్త కు గుడి కట్టింది.

బుధవారం గుడిలో భర్త నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బంధువులతో కలిసి పూజలు చేశారు. ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి తండావాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భర్తపై తనకున్న ప్రేమకు స్థానికులు సైతం ప్రశంసలు కురిపించారు. నిజానికి ఆడ మగ కాదు....భార్యా భర్త అంటే తోడు నీడ...భర్త లేని భార్య తోడు కోల్పోతే...భార్య లేని భర్త ధైర్యం కోల్పోతాడు. బంధం అంటే అదే...ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం ...ఒకరిని మరొకరు క్షమించుకోవడం ...ఇప్పుడు ఈ వార్త ఫుల్ వైరల్ అవుతుంది. గుడి కట్టిందంటే తనను ప్రేమగా చూసుకొని ఉంటారంటున్నారు నెటిజన్లు.

Tags:
Next Story
Share it