KCR:కేసీఆర్ బస్సులో సరికొత్త లిఫ్ట్.!

సాధారణంగా హీరో, హీరోయిన్లు ఇతర సెలబ్రిటీలు ఏ పని చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. వారు కొత్త కారు కొన్న, కొత్త బైక్ కొన్న, కొత్త ఇల్లు కొన్నా కానీ

KCR:కేసీఆర్ బస్సులో సరికొత్త లిఫ్ట్.!
X

న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా హీరో, హీరోయిన్లు ఇతర సెలబ్రిటీలు ఏ పని చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. వారు కొత్త కారు కొన్న, కొత్త బైక్ కొన్న, కొత్త ఇల్లు కొన్నా కానీ వారి అభిమానులు ఆనందంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి ఈ తరుణంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బస్సు కూడా వైరల్ గా మారింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏది చేసిన ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. ఆయన మాటే కాదు ఆయన చేతలు కూడా ఆ విధంగా ఉంటాయి. అలాంటి కేసీఆర్ బస్సును తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. సరికొత్త టెక్నాలజీతో ఈ బస్సు డిజైన్ చేశారు. ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ ఈ బస్సులోనే యాత్ర చేస్తూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముగిశాక ఆయన ప్రమాదవశాత్తు జారి పడటం వల్ల తన తుంటికి గాయం అయింది. దీంతో ఆయన విశ్రాంతి తీసుకొని, ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్స్ సందర్భంగా మళ్లీ ప్రచారంలో పాల్గొంటూ ప్రజలతో మమేకమవుతున్నారు.



ఆయన ప్రచార సమయంలో తన బస్సు ద్వారానే ప్రయాణం చేస్తున్నారు. ఆయనకు మెట్లు ఎక్కి, మెట్లు దిగడం కష్టంగా మారడంతో, ఆయన బస్సులో చాలా కంఫర్ట్ గా ఉండేలా సరికొత్త అప్డేట్స్ చేశారు. కేసీఆర్ వస్తున్నటువంటి బస్సు లోపల లిఫ్ట్ ఏర్పాటు చేశారు. రోడ్ షో టైంలో కేసీఆర్ ఆ లిస్టు బటన్ నొక్కి బస్సు పైకి వస్తున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మరి ఆ వీడియో మీరు కూడా చూసేయండి.

Tags:
Next Story
Share it