Belgian man: మందు తాగకుండానే 24/7 కిక్కు..!

బెల్జియన్ దేశంలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చిక్కుకున్నాడు. వాస్తవానికి అతడు మందు తాగకుండా కూడా... అతనిపై

Belgian man: మందు తాగకుండానే 24/7 కిక్కు..!
X

Belgian man: బెల్జియన్ దేశంలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చిక్కుకున్నాడు. వాస్తవానికి అతడు మందు తాగకుండా కూడా... అతనిపై చర్యలు తీసుకున్నారు ఆ దేశ పోలీసులు. అసలు ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.... బెల్జియన్ కు చెందిన ఓ వ్యక్తి కారులో వెళుతుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. ఈ తరుణంలో అతడు మద్యం సేవించినట్లు మెషిన్ చూపించింది.

దీంతో అతడి పై కేసులు బుక్ చేశారు పోలీసులు. అయితే ఆ తర్వాత ఈ కేసు కోర్టు విచారించింది. ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. నిందితుడు నిర్దోషిగా తేలిపోయాడు. దీనికి కారణం అతడు మందు తాగలేదు. కానీ మిషన్ మందు తాగినట్లు చూపించడానికి కారణం... సదరు వ్యక్తీలో ఓ అరుదైన వ్యాధి ఉండటం.

తెలుగులో ఒక సినిమా వచ్చినట్లు... బెల్జియన్ వ్యక్తికి కూడా శరీరంలో ఆటో బ్రూవరి సిండ్రం అంటే auto-brewery syndrome (ABS) అనే వ్యాధి సోకిందట. ఈ వ్యాధి ఉన్నవారికి శరీరంలో ఎప్పుడు ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుందట. ఈ విషయాన్ని వైద్యులు కూడా స్పష్టం చేశారు. అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో అతడు మందు తాగినట్లు తేలింది. ఇక కోర్టు దీనిని పరిశీలించి అతన్ని నిర్దోషిగా ప్రకటించింది.

Tags:
Next Story
Share it