Wittal: జింబాబ్వే మాజీ క్రికెటర్ పై చిరుత దాడి

జింబాబ్వే మాజీ క్రికెటర్ గై విట్టాల్‌పై చిరుత దాడి చేసింది. అప్రమత్తమైన పెంపుడు కుక్క అతని ప్రాణాలను కాపాడింది.

Wittal: జింబాబ్వే మాజీ క్రికెటర్ పై చిరుత దాడి
X

Wittal: జింబాబ్వే మాజీ క్రికెటర్ గై విట్టాల్‌పై చిరుత దాడి చేసింది. అప్రమత్తమైన పెంపుడు కుక్క అతని ప్రాణాలను కాపాడింది. ఈ విషయాన్ని వివరిస్తూ గై విట్టల్ భార్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వార్త వైరల్ అవుతుంది. విషయం ఏంటంటే.. 51 ఏళ్ల మాజీ ఆల్ రౌండర్ గై విట్టాల్ హ్యూమని ప్రాంతంలో ట్రెక్కింగ్ కు వెళ్లాడు. తనతో పాటు తన పెంపుడు కుక్క చికరాను తీసుకెళ్లాడు. అక్కడ అడవిలో పర్వతం ఎక్కుతుండగా విట్టల్‌పై అనుకోని విధంగా చిరుతపులి దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన విట్టల్ చిరుతను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో కుక్క చికరా మొరుగుతూ చిరుతపై దాడి చేసింది. దానికి ఏమాత్రం భయపడకుండా, తన యజమానిని కాపాడుకోవడానికి చాలా కష్టపడింది.

ఈ క్రమంలో కుక్క కూడా తీవ్రంగా గాయపడింది. రక్తం కారుతున్నప్పటికీ పోరాటం ఆపకుండా చిరుతను బెదిరించింది. దాంతో విట్టాల్ తీవ్రమైన గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. విట్టల్‌కు ప్రథమ చికిత్స చేసి కుక్కను ఆసుపత్రికి తరలించారు. చికారా ప్రస్తుతం కోలుకుంటోంది. విట్టల్‌కు శస్త్రచికిత్స కూడా జరిగింది. అదే కథనాన్ని పంచుకుంటూ, అతని భార్య హన్నా స్టోక్స్ ఇద్దరూ ఇప్పుడు మెరుగ్గా ఉన్నారని వెల్లడించారు. అయితే గతంలో కూడా భారీ ప్రమాదం నుంచి గై విట్టల్ తప్పించుకున్నాడని చెబుతున్నారు. 2013లో ఆయన ఇంట్లోకి భారీ మొసలి ప్రవేశించింది. ఈ విషయాన్ని రెస్క్యూ టీమ్‌కు ముందుగానే తెలియజేశారు. వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Tags:
Next Story
Share it