Japan: 200 మందితో వెళ్తున్న విమానం నుంచి ఒక్కసారిగా మంటలు

గాలిలో ఎగురుతున్న విమానం నుంచి అకస్మాత్తుగా పొగలు రావడంతో జపాన్‌లో 200 మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి.

Japan: 200 మందితో వెళ్తున్న విమానం నుంచి ఒక్కసారిగా మంటలు
X

Japan: గాలిలో ఎగురుతున్న విమానం నుంచి అకస్మాత్తుగా పొగలు రావడంతో జపాన్‌లో 200 మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. విమానం నుంచి పొగలు రావడంతో పైలట్ సహా సిబ్బందిలో భయాందోళన నెలకొంది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఆందోళన చెందారు. ఆల్ నిప్పాన్ ఎయిర్‌వేస్ (ANA)కి చెందిన విమానం బుధవారం ఫ్లైట్ సమయంలో పొగను వెదజల్లుతూ కనిపించింది. ఆ తర్వాత అది ఉత్తర జపాన్‌లోని షిన్ చిటోస్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.

ఎమర్జెన్సీ ల్యాండింగ్ వార్త ప్రయాణికులకు ప్రాణం పోసింది. దీంతో ప్రయాణికుల్లో చాలాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. అందరూ తమ ప్రాణాలను కాపాడుకోవాలనే తాపత్రయపడ్డారు. టోక్యో నుండి ANA విమానంలో సుమారు 200 మంది వ్యక్తులు ఉన్నారని.. ఎటువంటి గాయాలు సంభవించలేదని జపాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఇంజన్ స్విచ్ ఆఫ్ చేయడంతో విమానం రెక్కల ప్రాంతం నుంచి వచ్చే పొగ తగ్గిందని చెబుతున్నారు.

అంతకుముందు జనవరిలో కూడా ఒక విమానం కాలిపోయింది, ఈ ఘటన రాజధాని టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ సమయంలో జపాన్ ఎయిర్‌లైన్స్ (జేఏఎల్)కి చెందిన విమానం, కోస్ట్ గార్డ్ విమానం ఢీకొని మంటలు చెలరేగాయి. JAL విమానంలోని మొత్తం 379 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. కోస్ట్ గార్డ్ విమానం పైలట్ గాయపడ్డారు. ఐదుగురు సిబ్బంది మరణించారు.

Tags:
Next Story
Share it