South Korea : పిల్లలను కనాలనుకునే దంపతులకు సౌత్ కొరియా బంపర్ ఆఫర్

పిల్లలంటే ఖర్చు పెరుగుతుందని భావించే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు.

South Korea : పిల్లలను కనాలనుకునే దంపతులకు సౌత్ కొరియా బంపర్ ఆఫర్
X

South Korea : పిల్లలంటే ఖర్చు పెరుగుతుందని భావించే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి దక్షిణ కొరియా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంతానం ఉన్న తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. ఈ పథకం ఇప్పటికే అమలవుతోంది. కానీ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోవడంతో ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాన్ని పెంచాలని భావించింది. కొంతకాలంగా దక్షిణ కొరియా జనాభా తగ్గుతోంది. పెరుగుతున్న జీవన వ్యయంతో పిల్లలు భారమవుతున్నారని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో దేశ జనాభా రేటు భారీగా పడిపోయింది. 2023 సంవత్సరంలో, అత్యల్ప జనన రేటు 0.72కి పడిపోయింది. అందుకే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఒక్కో చిన్నారికి నెలకు రూ.65 వేలు ఇచ్చేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వం సిద్ధమైంది. ఈ భారీ మొత్తాన్ని ఎనిమిదేళ్లకు ఇవ్వనున్నారు. అంటే మొత్తం రూ.61 లక్షలు ఇస్తారు. దీంతో ప్రభుత్వానికి భారీ మొత్తంలో భారం పడుతుంది. సుమారు రూ. 1.3 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తం అక్కడి ప్రభుత్వ బడ్జెట్‌లో సగం అవుతుంది. ఇప్పటికే చైనాలో పిల్లలు, యువత లేక అక్కడి ప్రభుత్వం భయపడుతోంది. అలాంటి పరిస్థితి రాకుండా దక్షిణ కొరియా ముందుగానే ఈ నిర్ణయం తీసుకుంది.

Tags:
Next Story
Share it