Malaysia: గాల్లో ఢీకొన్న 2 హెలికాప్టర్లు.. 10 మంది మృతి

గాలిలో హెలికాప్టర్లు ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఏకంగా 10 మంది మృతి మరణించారు. ఈ సంఘటన మలేషియాలో మిలిటరీ ప్రదర్శనలో చోటు చేసుకుంది. ఈ సంఘటన

Malaysia: గాల్లో ఢీకొన్న 2 హెలికాప్టర్లు.. 10 మంది మృతి
X

2 Military Choppers Collide: గాలిలో హెలికాప్టర్లు ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఏకంగా 10 మంది మృతి మరణించారు. ఈ సంఘటన మలేషియాలో మిలిటరీ ప్రదర్శనలో చోటు చేసుకుంది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్‌ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

రాయల్ మలేషియా నేవీ పరేడ్ కోసం రిహార్సల్‌లో భాగంగా గాలిలో రెండు హెలికాప్టర్లు ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదం మంగళవారం రోజున చోటు చేసుకుంది. అయితే... ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందినట్లు నౌకాదళం ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమ రాష్ట్రమైన పెరాక్‌లోని లుముట్ నౌకాదళ స్థావరం వద్ద మంగళవారం ఉదయం 9.32 గంటలకు జరిగిన ప్రమాదంలో మొత్తం 10 మంది తమ నేవీ సిబ్బంది మరణించారని నౌకాదళం తెలిపింది.

Tags:
Next Story
Share it