శరీరం మొత్తం గాయాలు కావడంతో చిన్నారి విపరీతమైన నొప్పితో బాధపడుతోంది. నిద్ర కూడా పోవడం లేదు.ఆమె దవడ ఎముకలు తీవ్రంగా గాయపడ్డాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : దేశంలో ఈ వార్తలు చాలా సాధారణమైపోయాయి. కాని చిన్నారుల పై అత్యాచారాలు మాత్రం చాలా బాధకలిగిస్తాయి. మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో శరీరం మొత్తం గాయాలమయం అయ్యింది. ప్రస్తుతం ఆమె గ్వాలియర్ లోని కమలాఓ ఐదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. అత్యంత పాశవికంగా ప్రవర్తించడంతో చిన్నారి మర్మాంగాలపై దాదాపు 28 కుట్లు పడ్డాయి. రాజా హాస్పటిల్ లో ఐసీయూలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది.
శరీరం మొత్తం గాయాలు కావడంతో చిన్నారి విపరీతమైన నొప్పితో బాధపడుతోంది. నిద్ర కూడా పోవడం లేదు.ఆమె దవడ ఎముకలు తీవ్రంగా గాయపడ్డాయి. బెడ్ పై పక్కకు కూడా తిరగలేని స్థితిలో ఉంది. ఆమె పై అత్యాచారం చేసిన వ్యక్తి వయసు 17 ఏళ్లు. నిందుతిడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక తండ్రికి ఆరోగ్యం బాలేదు. ఆయనను చూడడానికి చిన్నారి తాత , నానమ్మ హాస్పటిల్ కు వెళ్లారు. తల్లి మరో చిన్న బాబుతో ఇంట్లో ఉంది. పాప ఇంటి బయట ఆడుకుంటుంది. పక్కింట్లో ఉండే కుర్రాడే నిందితుడు . ఈ టైంలోనే బాలికను ఓ పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి అఘూయిత్యానికి పాల్పడ్డాడు.
బాలిక అపహరణకు గురైన సమయంలో ఇంటి ముందు ఆడుకుంటోంది. ఆమె తల్లి ఇంట్లో చిన్న కుమారుడితో ఉంది. బాలికను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వైద్య బృందం తెలిపింది. ఇప్పటి వరకు 28 కుట్లు వేసినట్టు పేర్కొంది. అయితే వయసు రీత్యా గాయాలను తట్టుకునే శక్తి చిన్నారికి కాస్త తక్కువగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. నిందితుడిని ఉరి తియ్యాలని బాలిక బంధువులు డిమాండ్ చేస్తున్నారు.