వీరిద్దరితో ముందు నుంచి యువతికి స్నేహం ఉంది. హైదరాబాద్ లోని ఓ హాస్పటిల్ లో ఇంటర్న్ షిప్ చేయడానికి తను ఇటీవలె నగరానికి వచ్చింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : నమ్మి వెంట వచ్చిన స్నేహితురాలిపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ జె. ఉంపేదర్ తెలిపిన వివరాల ప్రకారం ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన యువతి (20) అక్కడే బయో మెడికల్ లాస్ట్ ఇయర్ చదువుతోంది. ఆ రాష్ట్రానికే చెందిన అజయ్ , హరి ప్రస్తుతం బాచుపల్లిలోని హరితవనం కాలనీలో నివసిస్తున్నారు. వీరిద్దరితో ముందు నుంచి యువతికి స్నేహం ఉంది. హైదరాబాద్ లోని ఓ హాస్పటిల్ లో ఇంటర్న్ షిప్ చేయడానికి తను ఇటీవలె నగరానికి వచ్చింది.
ఆ యువతి హైదరాబాద్కు వచ్చిన విషయం తెలిసి, అజయ్, హరి తాము ఉంటున్న నివాస ప్రాంతానికి రావాలని కోరారు. ఈ నెల 3 న నిజాంపేట రాజీవ్ గృహకల్ప సముదాయంలోని తాము అద్దెకు తీసుకున్న గదికి ఆమెను తీసుకున్నారు. అక్కడే ముగ్గురు కలిసి మద్యం తాగారు.
అర్ధరాత్రి సమయంలో అజయ్ , హరి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. గది నుంచి బయటకు వచ్చిన ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. అత్యాచారానికి పాల్పడిన యువకులకు దేహశుధ్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.