crime: తాగి తల్లిని కొడుతున్నాడని తండ్రిని గొడ్డలితో నరికి చంపేసిన కూతురు !

ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బాగ్‌బహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో నివసించే 50 ఏళ్ల వ్యక్తి హత్యకు గురయ్యాడు.


Published Apr 25, 2025 04:07:00 PM
postImages/2025-04-25/1745577835_76838417443322thumbnail3x2crime.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : తాగడం..కొట్టడం ఇవన్నీ చాలా కుటుంబాల్లో సాధారణమే అయినా ..ఆ కుటుంబంలో చిన్నారుల మానసిక పరిస్థితులు చాలా దారుణంగా నలిగిపోతుంది. రోజు తాగి వచ్చి తల్లిని కొడుతున్న తండ్రిని ఓ మైనర్ కూతురు గొడ్డలితో నరికి చంపేసింది. తర్వాత పోలీసులకు తన తండ్రిని వేరే వాళ్లు చంపినట్లు చెప్పింది. అయితే దర్యాప్తులో మాత్రం మైనర్ బాలికే చంపినట్లు తేలింది. అసలు ఏం జరిగిందంటే..


ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బాగ్‌బహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో నివసించే 50 ఏళ్ల వ్యక్తి హత్యకు గురయ్యాడు. గొడ్డలితో నరికి చంపిన అతడి శవాన్ని మంచంపై పడి ఉన్నట్లు ఏప్రిల్ 22న ఉదయం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ఇంటికి వెళ్లి పోలీసులు పరిశీలించారు. అయితే ఏప్రిల్‌ 21న రాత్రివేళ తల్లి ఇంట్లో లేకపోవడంతో కూతురు ఒక్కతే ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. తన తండ్రి తల్లితో గొడవపడంతో గొడ్డలితో నరికి చంపిందని దర్యాప్తులో తేలింది. మరోవైపు నిత్యం తాగి వచ్చి తల్లిని, తనను కొట్టడం, ఇంట్లో గొడవపడటం సహించలేక గొడ్డలితో నరికి తండ్రిని చంపినట్లు కూతురు ఒప్పుకున్నదని పోలీస్‌ అధికారి తెలిపారు. మైనర్ బాలికను జువైనల్ హోమ్ కు తరలించినట్లు చెప్పారు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu crime mother

Related Articles