Health:రోజు రాగిజావ తాగుతున్నారా..ఇవి మీకు తెలియాల్సిందే.?

ప్రస్తుత కాలంలో చాలామంది  చైనీస్ ఫుడ్ కు అలవాటు పడి మన ప్రాచ్యాత్య   ఆహారాన్ని పక్కన పడేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు ఇలా ఎన్నో కొవ్వులు ఉండే ఆహార పదార్థాలు


Published Sep 21, 2024 09:25:22 AM
postImages/2024-09-21/1726890922_ragi1.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది  చైనీస్ ఫుడ్ కు అలవాటు పడి మన ప్రాచ్యాత్య   ఆహారాన్ని పక్కన పడేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు ఇలా ఎన్నో కొవ్వులు ఉండే ఆహార పదార్థాలు తిని, అనారోగ్యం బారిన పడుతున్నారు. అలాంటివారు  ఆ ఫుడ్ కాస్త తగ్గించుకొని ప్రతిరోజు రాగిజావ తాగడం అలవాటు చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.  రాగి జావ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ, ఖర్చు కూడా తక్కువ అవుతుంది. రాగి జావ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రాగి జావలో కార్బోహైడ్రేట్లు, మినరల్స్, ఫైబర్లు, సీఈ విటమిన్లు, కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.  అంతేకాకుండా నియాసిన్, బి కాంప్లెక్స్, తయామిన్, రైబోఫ్లోవిన్, యూరిక్ యాసిడ్, కాల్షియం వంటివి కూడా అధికంగా ఉంటాయి. అందువల్ల రాగి జావ ప్రతిరోజు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అయిపోతాయి. అంతేకాకుండా రాగి జావలో ఉండే ఫైబర్ ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.

నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా రాగిజావ ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆ సమస్య దూరం అవుతుందట. ఇదే కాకుండా రాగి జావాలో ఉండే  డైటరీ ఫైబర్, మెగ్నీషియం, పాలిఫైనల్స్, మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుతాయట. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని, వాటి కండరాల పనితీరును కూడా ఎంతో మెరుగుపరుస్తుందట. అలాగే రాగిజావలో ఉండే సహజ ఇనుము రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడం కాకుండా ఎముకల బలోపేతానికి ఉపయోగపడుతుందని అంటున్నారు. కాబట్టి ప్రతిరోజు రాగి జావా తింటే అసలు డాక్టర్ అవసరమే ఉండడని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : health-benifits ragi-java magnesium polyphenols diabetes-control

Related Articles