TG Bjp Congress: నాకు నువ్వు నీకు నేను.. ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్న పార్టీలు.!

రాష్ట్రం రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. గతంలో బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అనే ప్రచారం జోరుగా జరిగింది. ఈ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 


Published Sep 21, 2024 12:11:00 AM
postImages/2024-09-21/1726897821_revanthreddyrajasingh.jpg

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రం రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. గతంలో బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అనే ప్రచారం జోరుగా జరిగింది. ఈ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అసలు విషయం బయటపడిందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ బీ టీమ్ గా మారిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. నాకు నువ్వు.. నేకు నీను అన్న చందంగా ఇప్పుడు బాహాటంగానే మద్దతు తెలుపుకుంటున్నాయట. ఇన్నాళ్లు కాస్త లోలోపల  ఉన్న మైత్రి.. ఇప్పుడు బహిర్గతం అయ్యిందని అంటున్నారు. గతంలో పెద్దగా కాంగ్రెస్ ను సపోర్ట్ చేస్తూ మాట్లాడని బీజేపీ నేతలు.. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తుతుండటంతో సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది. 

రాష్ట్రంలో అన్నదాతలు, ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా ఏనాడు బీజేపీ నోరు మెదపలేదు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అర్థరాత్రి వరకు ఆందోళనలు చేసినా మాట్లాడలేదు. రూ.2లక్షల రుణమాఫీ కాకపోయినా, రైతుభరోసా ఇవ్వకపోయినా ఓ ప్రతిపక్షపార్టీగా ఎప్పుడూ ప్రభుత్వాన్ని నిలదీసిన దాఖలు లేవు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చి నడిరోడ్డున పడేసినా ఎవరూ పట్టించుకోలేదు. పైగా.. హైడ్రాను అద్భుతమంటూ బీజేపీ ముఖ్యనేతలే కితాబు ఇచ్చారు.  ప్రజా సమస్యలపై ఏనాడూ సర్కారును నిలదీయలేదని ఓపెన్ సీక్రెట్. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా బీఆర్ఎస్ పార్టీపైనే విమర్శలు చేసింది తప్పా.. కాంగ్రెస్ ను పల్లెత్తు మాట అనడం లేదు బీజేపీ నాయకులు. 

ఇటీవల వినాయక నిమజ్జన ఏర్పాట్లపై గోషామాహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రేవంత్ ను ఆకాశానికి ఎత్తారు. ఎప్పుడు ఇంత గొప్పగా ఏర్పాట్లు లేవన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్లుగా.. స్వయంగా వెళ్లి నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించారని ప్రశంసించారు. వినాయక నిమజ్జనంలో రెగ్యులర్ గా బాలాపూర్ వినాయకుడిని నిమజ్జనం చేసే దగ్గర కాకుండా అప్పటికప్పుడు వేరే దగ్గరకు షిప్ట్ చేయడంపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కానీ రాజాసింగ్ మాత్రం ఏర్పాట్లు బాగున్నాయని చెప్పడం ఆ రెండు పార్టీల అనుబంధానికి ఓ నిదర్శనమని చర్చించుకుంటున్నారు.

మరోవైపు.. గాంధీ హాస్పిటల్స్ లో పసి పిల్లలు, గర్భిణీలు చనిపోతే అక్కడ కూడా రేవంత్ రెడ్డిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. అంతమంది చనిపోతే కనీసం విచారం వ్యక్తం చేయకుండా.. మరణాలు సాధారణమే అన్నట్టుగా మాట్లాడారు. ఇక్కడ కూడా నెపాన్ని గత సర్కారు మీదే వేశారు. 
రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు తాను RSS నుంచి వచ్చానని చెప్పడం, బీజేపీ నేతలతో సీక్రెట్ గా టచ్ లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.

ఈ టైంలో ఇక్కడి బీజేపీ నేతలు ప్రభుత్వ తప్పులను చెప్పకుండా మద్దతు పలకడం చూస్తే ఈ రెండు పార్టీలు కలిసిపోయాయనే చర్చ నడుస్తోంది. ఎప్పటి నుంచో ఈ దోస్తీ ఉందని.. అందుకే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో రెండు పార్టీలు సహరించుకున్నాయనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. దీనిపై ఇన్నిరోజులు దాటవేస్తూ వచ్చిన బీజేపీ నేతలు.. ఒక్కొక్కరుగా ఇప్పుడు రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ సర్కారుపై తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎవరు ఎవరికి బీ టీం అనేది తేలిపోయిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana news-line newslinetelugu congress bjp cm-revanth-reddy rahul-gandhi narendra-modi rajasingh balapur

Related Articles