Rachel Gupta: దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం !

పంజాబ్ కు చెందిన 20 ఏళ్ల రేచల్ గుప్తా ప్రతిష్ట్మాక మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 కిరిటాన్ని అందుకున్నారు.


Published Oct 27, 2024 08:21:46 AM
postImages/2024-10-27/1730035201_rachelgupta.jpg

న్యూస్ లైన్, స్పెసల్ డెస్క్:  పంజాబ్ కు చెందిన 20 ఏళ్ల రేచల్ గుప్తా ప్రతిష్ట్మాక మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 కిరిటాన్ని అందుకున్నారు. బ్యాంకాక్ లో జరిగిన ఈ పోటీల్లో దాదాపు 70 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్నారు. వీరిలో  రేచల్ టైటిల్ ను సాధించారు. ఈ విజయంతో రేచల్ ‘గ్రాండ్ పీజెంట్ చాయిస్’ అవార్డును కూడా గెలుచుకుని మిస్ యూనివర్స్ 2000 లారా దత్తా సరసన చేరారు.


తన విజయాన్ని రేచల్ తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకున్నారు. ఇండియా హిస్టరీలోనే ఫస్ట్ గోల్డెన్ క్రౌన్ ను గెలుచుకున్నట్లు తెలిపారు. ఈ సంధర్భంగా తన పై విశ్వాసం ఉంచిన అందరికి పేరు పేరున థాంక్యూ చెప్పుకొచ్చింది. తను గోల్డ్ క్రౌన్ గెలుచుకోవడం భారత్ చరిత్రలో మొదటిసారి జరిగిన సంఘటన అని తెలిపింది. మిస్ గ్రాండ్ గెలుచుకున్న వారికి ఇంటర్నేషనల్ పోటీలకు అర్హత సాధించినట్లే.


రేచల్ 2022లో ‘మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ద వరల్డ్’ టైటిల్ కూడా సాధించారు. ఇన్‌స్టాలో ఆమెకు మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 విజేతగా నిలిచిన ఆమె గ్లోబల్ అంబాసిడర్‌గా ప్రపంచ శాంతి, స్థిరత్వంపై ప్రచారం కల్పిస్తారు. రేచల్ మరిన్ని విజాలు సాధించాలని కోరుకుంటున్నారు నెటిజన్లు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by

newsline-whatsapp-channel
Tags : newslinetelugu beauty golden-crown thailand- rechal-guptha

Related Articles