Viral Video: హే ..మంకీ మ్యాన్ ...జీనీ ..ఏంటి రోడ్డుమీద డ్యాన్స్ చేస్తున్నారు !

ఈ వీడియోలో ఒక వీధి గోడమీద కోతి కుర్చుని ఉండగా.. సమీపంలో జెనీ నిల్చుని ఉంది. వీధిలో ఇద్దరు అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు. 


Published Oct 23, 2024 12:23:00 PM
postImages/2024-10-23/1729666730_AladdinGenieRole.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అల్లా వుద్దీన్ అధ్భుత దీపం..వినగానే జీనీ మాయాజాలమే గుర్తు వస్తుంది, పిల్లల ఫేవరేట్ . ఇక మంకీ మ్యాన్ కూడా  ఫుల్ ఫేమస్ . అయితే వీరిద్దరు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో భయంకరమైన వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక వీధి గోడమీద కోతి కుర్చుని ఉండగా.. సమీపంలో జెనీ నిల్చుని ఉంది. వీధిలో ఇద్దరు అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు. 


వీడియోలో జిన్ కొన్ని క్లాసిక్ డ్యాన్స్ మూమెంట్స్ ను ప్రదర్శిస్తుండగా.. తన డ్యాన్స్ పార్ట్‌నర్ ఐన కోతితో కలిసి ‘డ్యాన్స్ షోలో పాల్గొన్నాడు. కిడ్స్ స్పెషల్ అయిన పాత్రలు రోడ్డుపై ఇలా డ్యాన్స్ చెయ్యడం భలే హ్యాపీ గా ఎంజాయ్ చేశారు పిల్లలు. వీడియోలో జెనీ, మంకీమ్యాన్ ట్రెండింగ్ పాటకు డ్యాన్స్ చేయడం చూడవచ్చు.ఇద్దరు పిల్లలు తమ బాల్కనీలో నిలబడి ప్రత్యక్ష ప్రదర్శనను వీక్షిస్తూ చాలా ఉత్సాహంగా కేరింతలు కొడుతున్నారు.


ఈ వీడియో ఈ ఏడాది ఆగస్టు చివరిలో షేర్ చేయబడింది.. ఈ వీడియోకి ఇప్పటివరకు 12 మిలియన్ల వ్యూస్, రెండు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. జెనీ, మంకీమ్యాన్ యొక్క క్లాసిక్ డ్యాన్స్ రీతులు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఈ క్రేజీ కాంభినేషన్ డాన్స్ ను ఇంటర్నెట్ చాలా వైరల్ చేస్తుంది.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sachin Rao Attavar (@sachin_rao_attavar)

newsline-whatsapp-channel
Tags : newslinetelugu social-media viral-video dance-master

Related Articles