Babita Phogat: 'దంగ‌ల్' సినిమాకు అసలు బబితాకు ఎంత ఇచ్చారో తెలుసా ?


రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన‌ బబిత తాజాగా ఓ న్యూస్ ఛానెల్ నిర్వ‌హించిన ఇంట‌ర్వ్యూలో ఈ విషయం చెప్పారు.


Published Oct 28, 2024 12:28:00 PM
postImages/2024-10-28/1730098924_202410image1334150662650babitaphogat.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దంగల్ సినిమాకి అసలు పరిచయాలక్కర్లేదు. అన్ని  ఇండస్ట్రీ ల్లోను సూపర్ డూపర్ హిట్టు సినిమా. రెండు వేల కోట్లు కలక్షన్లు వచ్చిన తర్వాత అసలు బబితా ఫోగట్ కు గీతా ఫోగట్ కు ఎంత డబ్బు ఇచ్చి ఉంటారో తెలుసా. బాలీవుడ్‌ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్‌ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలైన తర్వాత ప‌లు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ మూవీ ఏకంగా రూ.2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని బాలీవుడ్ టాక్. కాని గీతా , బబితాకు జస్ట్ కోటి రూపాయిలు మాత్రమే ఇచ్చారట.


రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన‌ బబిత తాజాగా ఓ న్యూస్ ఛానెల్ నిర్వ‌హించిన ఇంట‌ర్వ్యూలో ఈ విషయం చెప్పారు. కోటి రూపాయిలు తమకు స్టోరీకి గాను అందాయని తెలిపారు. మేం డబ్బు కోసం ఆలోచించలేదు. జస్ట్ మాకు కావాల్సిందల్లా ప్రజాదరణ .


 2016లో విడుదలైన 'దంగల్' చిత్రం మహావీర్ ఫోగట్ తన కుమార్తెలను ఎలైట్ రెజ్లర్‌లుగా ఎలా మార్చార‌నే దాని చుట్టూ కథ తిరుగుతుంది. ఆ త‌ర్వాత‌ ఇద్ద‌రూ కూతుళ్లు దేశానికి ప‌త‌కాలు సాధించ‌డం చూపించారు. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. 2012లో జరిగిన ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఆమె కాంస్య పతకం సాధించారు. 2014 లో ఆమె కామన్వెల్త్ లో గోల్డ్ కొట్టారు. 2016 రియో ఒలింపిక్స్ లో ఎలాంటి పతకాలు రాలేదు. కాని 2019 లో బబిత కుస్తీకి గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్లారు.
 

newsline-whatsapp-channel
Tags : movies ameer-ali-khan remuniration

Related Articles