viral: బిచ్చగాడి దగ్గర అప్పు చేసిన తీర్చలేక IP పెట్టిన వ్యాపారి !

ఇలా 60 మంది దగ్గర దొరికిన దగ్గర దొరికినట్లు దోచేసి ఐపీ పెట్టేశాడు.ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్​లో యాచకుడి కథ ఇది.


Published Oct 28, 2024 10:30:00 AM
postImages/2024-10-28/1730091720_22774346beggaripnotice.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బిచ్చగాడు వాడి దగ్గర ఏముంటుంది అనుకుంటారు చాలామంది. కాని వాళ్లే తిని తినక...రేపు అన్న రోజు ఎలా ఉంటుందో అని డబ్బు దాచుకుంటారు. ఓపిక ఉన్నపుడు ఇలా జరిగిపోతుంది. ఒంట్లో సత్తువలేకపోతే ఎవరు చూస్తారు ఇలా ఎన్నో ఆలోచనలు చేసి డబ్బు దాచుకున్నాడు ఓ ముసలి బిచ్చగాడు.

గుడి దగ్గర యాచన చేస్తూ దొరికింది తింటూ..దొరకని రోజు సర్దుకొని 50 వేల రూపాయిలు దాచుకున్నాడట. అయితే అధిక వడ్డీ ఇస్తానంటు ఓ వ్యాపారి ఆశ చూపితే ...ఆ డబ్బును తనకిచ్చాడు. వడ్డీ మాట దేవుడెరుగు...అసలు మొత్తం తీసుకొని అతను పరారయ్యాడు.50 వేలకు పరారీనా అనుకుంటారేమో ..ఇలా 60 మంది దగ్గర దొరికిన దగ్గర దొరికినట్లు దోచేసి ఐపీ పెట్టేశాడు.ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్​లో యాచకుడి కథ ఇది.


రీసెంట్ గా బిచ్చగాడు అశోక్‌తో పాటు మొత్తం 69 మంది వ్యక్తులకు ఐపీ నోటీసులు పంపాడు. ఖమ్మంలోని సివిల్ కోర్టులో దివాళా పిటిషన్ అప్లై చేశాడు. అయితే ఈ 69 మంది వద్ద కోటీ 95 లక్షలు అప్పుచేశాడు . వారిలో ఈ యాచకుడు ఒకరు.​తనను ఇలా మోసం చేయడం ధర్మం కాదని ఏదైనా దారి చూపాలని ఊరిపెద్దలను కోరారు బిచ్చగాడు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news

Related Articles