Apple: ఇవాళ్టి నుంచే ఐఫోన్ 16 విక్రయాలు!

ఐఫోన్ ప్రో సీరీస్ ఫోన్లను ఫస్ట్ టైం అసెంబ్లింగ్ చేస్తున్నా ఎప్పుడు అమ్మకాలు జరుగుతాయనేది చెప్పలేదు. అయితే ఈ రోజు నుంచి ఐఫోన్ 16 అమ్మకాలు జరుగుతున్నాయి. ఐఫోన్ 16 ప్రో సీరీస్ ఫోన్ల ఇండియన్ మార్కెట్లో దొరుకుతాయనేది ఇంకా తెలపలేదు ఐఫోన్ టీం. 


Published Sep 20, 2024 10:14:00 AM
postImages/2024-09-20/1726807530_sefiltrancoloresiphone16pro.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఐఫోన్ అనగానే నోరు తెరుస్తాం..క్రేజ్ అలాంటిది. ప్రతి సీరిస్ లోను పెద్దగా కొత్తదనం ఏం లేకపోయినా ఐఫోన్ కోసం వెంటపడడం మాత్రం మానం. అయితే గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థ అపిల్ తన ఐ ఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం ఈ రోజు (సెప్టెంబర్20) నుండి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.  ఐఫోన్ ప్రో సీరీస్ ఫోన్లను ఫస్ట్ టైం అసెంబ్లింగ్ చేస్తున్నా ఎప్పుడు అమ్మకాలు జరుగుతాయనేది చెప్పలేదు. అయితే ఈ రోజు నుంచి ఐఫోన్ 16 అమ్మకాలు జరుగుతున్నాయి. ఐఫోన్ 16 ప్రో సీరీస్ ఫోన్ల ఇండియన్ మార్కెట్లో దొరుకుతాయనేది ఇంకా తెలపలేదు ఐఫోన్ టీం. 


ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో స్మార్ట్ ఫోన్లపై దిగుమతి సుంకం తగ్గించిన నేపథ్యంలో గత వర్షన్ ఐ ఫోన్ల కంటే ఐ ఫోన్ 16 సిరీస్ మొబైల్ ధరలు తగ్గనున్నాయి. ఎప్పటి లాగే లక్ష పైమాటే ఉన్నా ..ఓ పది , ఇరవై వేలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.  ఐ ఫోన్ 16 ప్రో మొబైల్ ధర రూ.1,19,900లు, ఐ ఫోన్ 16 ప్రో మ్యాక్స్ మొబైల్ ధర రూ.1,44,900 నుండి ప్రారంభం అవుతుందని ఆపిల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఐఫోన్ 16 లోను 16 ప్లస్ లోను రేట్లు పెద్ద గా మార్పు ఉండదంటున్నారు ఆపిల్ కంపెనీ వారు. ఐ ఫోన్ 16 మొబైల్ ను రూ.79,900లు, ఐ ఫోన్ 16 ప్లస్ మొబైల్ ను రూ.89,900లకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. పాత ఫోన్లు ఎక్సైంజ్ పై డైరక్ట్ ఐఫోన్ షో రూమ్ వాళ్లే క్లారిటీ ఇస్తారంటుంది .

newsline-whatsapp-channel
Tags : business apple-phone

Related Articles