Gold Rate:భారీగా తగ్గిన గోల్డ్ ధర..మరీ ఇంత తక్కువా?

ఇండియాలో గోల్డ్ అంటే ఎక్కువగా ఇష్టపడతారు.  ఏ పండగ వచ్చిన ఏ ఫంక్షన్ అయినా ఆడవారి మెడలో గోల్డ్ ఉండాల్సిందే. అలాంటి గోల్డ్ ప్రస్తుత కాలంలో మగవాళ్లు కూడా అత్యధికంగా ధరిస్తున్నారు.


Published Sep 13, 2024 07:54:27 AM
postImages/2024-09-13/1726194267_GOLD1.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఇండియాలో గోల్డ్ అంటే ఎక్కువగా ఇష్టపడతారు.  ఏ పండగ వచ్చిన ఏ ఫంక్షన్ అయినా ఆడవారి మెడలో గోల్డ్ ఉండాల్సిందే. అలాంటి గోల్డ్ ప్రస్తుత కాలంలో మగవాళ్లు కూడా అత్యధికంగా ధరిస్తున్నారు.  ఎక్కువ గోల్డ్ ధరిస్తే సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు.  అలాంటి గోల్డ్ రేట్లు ప్రస్తుత కాలంలో ఆకాశాన్ని అంటాయి. గోల్డ్ కోనడం చాలా కష్టతరంగా మారింది.  అలాంటి గోల్డ్ ధర తాజాగా తగ్గుముఖం పట్టింది.  దేశవ్యాప్తంగా గోల్డ్ వెండి ధరలు స్వల్పంగా తగ్గుతూ వచ్చాయి.

ఈరోజు ఉదయం 6 గంటల వరకు  నమోదైనటువంటి వివరాల ప్రకారం. 10 గ్రాముల బంగారం ధర నిన్నటి ధరతో పోలిస్తే 10% తగ్గుదల కనిపిస్తోంది. అంతేకాకుండా వెండి ధర కిలోకి ₹100 చొప్పున తగ్గినట్టు కనబడుతోంది. మరి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ని విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర  రూ:67,040 గా ఉన్నది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ:73,140గా ఉన్నది.

 ముంబై ఢిల్లీ ధర:
 ఇక ఇతర రాష్ట్రాలైనటువంటి  ముంబై ఢిల్లీలో కూడా ధర తగ్గినట్టు తెలుస్తోంది. ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర  రూ:67,190 గా ఉన్నది. 24 క్యారెట్స్ 10గ్రా..  ధర రూ:73,290గా ఉన్నది. ఇక ముంబై నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ:67,040 క ఉంది. అంతేకాకుండా 24 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ ధర  రూ:73,140 గా ఉన్నది. 

 వెండి:
 ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 100 రూపాయలు తగ్గుదలతో  91,400గా కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర ₹100 తగ్గి 86,400గా కొనసాగుతోంది.

newsline-whatsapp-channel
Tags : news-line hyderabad mumbai silver-rate chennai gold-rate market

Related Articles