Gold and Silver : ధర పెరిగిన వెండి, బంగారం ..సిటీలో ధరలు ఎలా ఉన్నాయంటే!

22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 10 పెరిగి 67వేల160 రూపాయిలు చేరింది. అదే 10 గ్రాముల బంగారం 24 క్యారట్లు 73,260 గా నమోదయ్యింది. 


Published Sep 12, 2024 07:31:00 AM
postImages/2024-09-12/1726106494_15801270821965.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పుత్తడి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పది ఇరవై తగ్గుతుంది. వందల్లో వేలల్లో పెరుగుతుంది.  ఏంటో ఈ మార్కెట్ మాయాజాలం .దేశంలో బంగారం ధర ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. గ్రాము మీద పది రూపాయిలు పెరిగి తులానికి వంద రూపాయిలు కేజీ వెయ్యి రూపాయిలు బంగారం రేట్లు పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 10 పెరిగి 67వేల160 రూపాయిలు చేరింది. అదే 10 గ్రాముల బంగారం 24 క్యారట్లు 73,260 గా నమోదయ్యింది. 


అయితే గ్రాము బంగారం ధర 22 క్యారట్లు 6700 కాగా 24 క్యారట్ల బంగారం ధర 7320 గా నడుస్తుంది. ఇవే ధరలు ఆంద్రప్రదేశ్ ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఇదే ధర తో మార్కెట్ నడుస్తుంది.


చెన్నైలో గురువారం సెప్టెంబర్ 12 వ తేదీన 22 క్యారెట్ల పసిడి (10గ్రాముల) ధర రూ. 67,160గా ఉంది. 10గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10గ్రాముల ధర రూ. 73,260గా ఉంది.


బెంగళూరులో ఈ రోజు బంగారం ధరలు 22 క్యారెట్ల గోల్డ్​10గ్రాముల ధర రూ. 67,160గాను.. 24 క్యారెట్ల పసిడి 10గ్రాముల రూ. 73,260గాను ఉంది.


కోల్​కతాలో ఈ రోజు 22 క్యారెట్ల పసిడి 10గ్రాముల ధర రూ. 67,160లకు చేరుకుంది. 24 క్యారెట్ల గోల్డ్​10గ్రాముల ధర. రూ. 73,260గా ఉంది. ముంబై , కేరళ , కర్ణాటక లో ఇదే ధర.


అయితే ఈ ధరల్లో మార్పులు ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాల ఆధారంగా పెరగడం , తగ్గడం జరుగుతూనే ఉంటాయి.


దేశంలో వెండి ధరలు


కిలో లక్ష మార్క్ ను చేరుకున్న వెండి ధర దిగి వచ్చినట్లే దిగి వస్తూ మళ్ళీ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నా..కలకత్తా , బెంగుళూరు లో వెండి రేట్లు తక్కువగానే ఉంటున్నాయి. బుధవారం కిలో వెండి ధర రూ. 86,500లు ఉండగా ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 86,600గా కొనసాగుతోంది. ఇక హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 91,600 పలుకుతోంది. ఇదే ధర విజయవాడ, విశాఖలోనూ కొనసాగుతోంది.
 

newsline-whatsapp-channel
Tags : business gold-rates silver-rate stock-market

Related Articles