ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న విషయం ఏంటయ్యా అంటే జానీ మాస్టర్ వివాదం అని చెప్పవచ్చు. మొన్నటి వరకు మంచి పేరుతో గొప్ప డాన్స్ మాస్టర్ గా ఉన్నటువంటి జానీ మాస్టర్ ఒక్కసారిగా
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న విషయం ఏంటయ్యా అంటే జానీ మాస్టర్ వివాదం అని చెప్పవచ్చు. మొన్నటి వరకు మంచి పేరుతో గొప్ప డాన్స్ మాస్టర్ గా ఉన్నటువంటి జానీ మాస్టర్ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయారు.. ఆయనపై ఆరోపణ వచ్చిందో లేదో వెంటనే జనసేన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు.
అలా జానీ మాస్టర్ పేరు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారో, అదంతా ఒక్కసారిగా కూలిపోయిందని చెప్పవచ్చు. అయితే జానీ మాస్టారుతో శ్రేస్టా అనే అమ్మాయి చాలా ఏళ్ల నుంచి పనిచేస్తోంది. అయితే ఆమెను జానీ మాస్టర్ చాలా వరకు బెదిరింపులకు గురి చేసి లైంగికంగా వాడుకున్నాడట. ఎక్కడ షూటింగ్స్ ఉన్న ఆమెను తీసుకెళ్లి గదుల్లో తనతోనే ఉంచుకొని విపరీతంగా వేధించేవాడట.
చివరికి ఆయన వేధింపులను తట్టుకోలేక ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆమె వివరణ తీసుకున్న పోలీసులు జానీ మాస్టర్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టడంతో జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి జానీ మాస్టారును బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు.
దీంతో అక్కడి నుంచి హైదరాబాదుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం జానీ మాస్టర్ నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నారు. ఒక సీక్రెట్ ప్రదేశంలోకి తీసుకెళ్లి విచారణ చేపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయన చెప్పిన స్టేట్మెంట్ ను తీసుకొని పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరు పరిచనున్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి జానీ మాస్టర్ కు కోర్టు ఎలాంటి శిక్ష వేస్తుంది. ఆయన పోలీసులకు ఎలాంటి వివరాలు ఇచ్చారు అనేది ముందు ముందు తెలుస్తుంది.