SIMHACHALAM: ఈ రోజే సింహాచలం గిరిప్రదక్షిణ..లక్షల్లో భక్తులు

గిరిప్రదక్షిణ చేస్తే భువి ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం వస్తుందని భక్తుల నమ్మకం . దీనికి తోడు వనమూలికలతో కూడిన కొండ చుట్టు  32 కిలోమీటర్లు తిరిగితే ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం . సింహాచలం తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ మొదలుపెడతారు. ఈ గిరిప్రదక్షిణ వల్ల కొండ చుట్టు వనమూలికల గాలి తగిలి ఆరోగ్యంగా ఉంటారని పెద్దల మాట.


Published Jul 20, 2024 02:34:00 PM
postImages/2024-07-20/1721466333_OutsideImage31.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: గిరిప్రదక్షిణ చేస్తే భువి ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం వస్తుందని భక్తుల నమ్మకం . దీనికి తోడు వనమూలికలతో కూడిన కొండ చుట్టు  32 కిలోమీటర్లు తిరిగితే ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం . సింహాచలం తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ మొదలుపెడతారు. ఈ గిరిప్రదక్షిణ వల్ల కొండ చుట్టు వనమూలికల గాలి తగిలి ఆరోగ్యంగా ఉంటారని పెద్దల మాట.


శనివారం మధ్యాహ్నం సంప్రదాయబద్ధంగా గిరి ప్రదక్షణ ప్రారంభం కానుంది. ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణను ప్రారంభించి పౌర్ణమి నాడు స్వామిని దర్శించుకోవడం ఆనం వాయితీగా వస్తోంది. గిరి ప్రదక్షిణ చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారు. కొన్ని లక్షల మంది జనాలు గిరిప్రదక్షిణ చేయడానికి వస్తుంటారు.
తొలిపావంచా వద్ద స్వామివారి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. ఆలయ అనువంశిక ధర్మకర్తలు రథాన్ని ప్రారంభిస్తారు. రథం తొలిపావంచా నుంచి పాత అడివివరం మీదుగా సెంట్రల్ జైల్, ముడసర్లోవ, చినగదిలి, హనుమం తవాక, విశాలక్షినగర్ మీదుగా జోడుగుళ్లు పాలెం బీచ్ కు చేరుకుంటుంది. అక్కడ నుంచి అప్పుఘర్, ఎంవీపీ డబుల్ రోడ్డు మీదుగా వెంకోజీపాలెం, ఇసుకతోట హెచ్బీ కాలనీ , సీతమ్మధార , కంచరపాలెం , డీఎల్బీ క్వార్టర్స్, మాధవధార, మురళీ నగర్, ఆర్ అండ్ బీ, ఎన్ఏడీ జంక్షన్, గోపాలపట్నం. బంకు, ప్రహ్లాదపురం, గోశాల మీదుగా తిరిగి తొలిపావంచా వద్దకు చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ ముగుస్తుంది. దాదాపు సిటీ అంతా దాదాపు కవర్ చేసేసినట్లే.

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu bhakthi

Related Articles