MOVIE: 100 కోట్ల సినిమాను వదులుకున్న శివానీ ..చేసుంటే ఓ రేంజ్ లో ఉండేదిగా !


Published Sep 18, 2024 10:36:00 PM
postImages/2024-09-18/1726679205_ShivaniRajashekar1.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: శివాని రాజశేఖర్ ...స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్త గా అడుగులు వేస్తుంది. బోల్డ్ పాత్రలు ..బట్టలు సరిగ్గా లేని పాత్రలు చెయ్యదు. లవ్ మేకింగ్ సీన్స్ , రొమాన్స్ సీన్స్ , బెడ్ రూమ్ సీన్స్  చెయ్యలేనేమో అని డౌట్ అందుకే ఓ వంద కోట్ల కలక్షన్ సినిమాను మిస్ చేసేసుకుంది. కాని పొరాపాటున ఒప్పుకొని చేసి ఉంటే ..మాత్రం స్టార్ అయ్యేది.


ఇంతకీ ఏం సినిమా అంటే ఉప్పెన ...ఇప్పుడు కృతి శెట్టికి వచ్చిన ఫేమ్ అంతా  శివానీ కి రావాల్సిందే అయితే డైరక్టర్ శివాని కి చెప్పిన కథలో చాలా బోల్డ్ కంటెంట్ ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన కావడం ..వైష్ణవ తేజ్ హీరో లాంటివి ఏవీ నాకు కనిపించలేదు. బోల్డ్ కంటెంట్ మాత్రమే నేను ఆలోచించాను. నాకుఅంతగా అనిపించలేదు ..వదిలేసానని తెలిపింది.


స్టార్ హీరోల సినిమాలలో మంచి పాత్రలలో నటించినా శివాని కెరీర్ పుంజుకుంటుందని చెప్పవచ్చు. శివాని రాజశేఖర్ రెమ్యునరేషన్ కూడా పరిమితంగా ఉందని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో శివాని రాజశేఖర్ కెరీర్ పరంగా మరింత ఎదుగుతారేమో చూడాల్సి ఉంది. శివాని తన పాత్రను చక్కగా ఎన్నుకుంటుంది. కథలో తన పాత్ర ను అందంగా మలిచే డైరక్టర్లకే ఓకే చెప్తుంది. చూద్దాం..ముందు ముందు మరెన్ని ప్రాజెక్ట్స్ చేస్తుందో చూడాలి.

newsline-whatsapp-channel
Tags : rajshekar uppena buchibabu shivanni-rajashekar daughter

Related Articles