స్పీడ్ తగ్గకుండా బిజినెస్ చేస్తుంది. అంతేనా సినిమా ప్రమోషన్లు, షాపింగ్ వీడియోలు , పొలిటికల్ ప్రచారాలు చేస్తూనే ఉంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కుమారి ఆంటీ సోషల్ మీడియా స్టార్. జస్ట్ చిన్న స్ట్రీట్ వెండర్ నుంచి ఇప్పుడు తన పేరు తెలియని తెలుగు ప్రజలు లేనంత ఫేమ్ సంపాదించుకుంది.హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి పరిసరాల్లో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆమెను యూట్యూబర్లు, ఇన్ప్లుయెన్సర్స్ ఇంటర్వ్యూలు చేయడంతో ఒక్కసారిగా ఫేమ్ అయ్యింది. చాలా మంది ట్రోల్ చేశారు. అయినా స్పీడ్ తగ్గకుండా బిజినెస్ చేస్తుంది. అంతేనా సినిమా ప్రమోషన్లు, షాపింగ్ వీడియోలు , పొలిటికల్ ప్రచారాలు చేస్తూనే ఉంది.
తనకున్న దాంట్లో ఎంతో కొంత సాయం చేస్తుంది. తెలంగాణ వరద బాధితుల సహాయనిధికి రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. తనే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి చెక్ అందించింది ఆమె. ఎక్కువ డబ్బు కాకపోయినా తనకు తోచిన సాయం చేశానని తెలిపింది కుమారీ ఆంటీ.
తెలంగాణ, ఆంద్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు ఖమ్మం, మహబుబాబాద్.. అటు ఎన్టీఆర్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పంటలు పోయాయి. విపత్తు సర్వం కోల్పోయారు. పెద్ద పెద్ద స్టార్స్ నుంచి.. చిన్న స్టార్స్ కూడా తమ వంతు సాయాన్ని అందించారు.