multiplex ఏ థియేటర్ అయినా 99 రూపాయిలే టికెట్ ..ఎప్పుడంటే!

ఒక్కో టికెట్ ధర 250 రూపాయలకు పైమాటే. కుటుంబంతో వెళ్లాలంటే ..పక్కాగా 1500 నుంచి 2000 వదిలిపోతుంది. ఈ రోజుల్లో రేట్లు అలా ఉన్నాయి.


Published Sep 18, 2024 07:08:55 AM
postImages/2024-09-18/1726659923_multipleximage.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టెన్షన్ ఫ్రీ కావాలి..అందిరికి కావాలి ..కుదరదు బరువులు , బాధ్యతలు . ఆ కొంచెం సేపు హ్యాపీ అంటే ఫ్యామిలీ తో గడపడమే. సినిమాలు ..ట్రిప్పులు ఇవే మనసుకు ఆనందాన్ని ఇచ్చేవి.సినిమాలు చూడాలంటే.. జేబుకు చిల్లుపడాల్సిందే. ఒక్కో టికెట్ ధర 250 రూపాయలకు పైమాటే. కుటుంబంతో వెళ్లాలంటే ..పక్కాగా 1500 నుంచి 2000 వదిలిపోతుంది. ఈ రోజుల్లో రేట్లు అలా ఉన్నాయి.


మల్టీ ఫ్లెక్స్ థియేటర్లలో ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలనుకున్న ఆడియెన్స్‌కు శుభవార్త చెప్పింది మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. జస్ట్ రూ. 99కే సినిమా చూసే అవకాశాన్ని ఇస్తున్నాయి మల్టీ ఫ్లెక్స్. సెప్టెంబర్ 20 న నేషనల్ సినిమాడే సంధర్భంగా మల్టీప్లెక్స్ చైన్ థియేటర్లలో ఈ 99 రూపాయిల టికెట్ ధర అందిస్తున్నారు. ఏ షో అయినా టికెట్ ధర జస్ట్ 99 మాత్రమే.


పీవీఆర్, ఐనాక్స్, మిరాజ్, ఏషియన్, సినీపోలీస్ లాంటి చైన్లతో పాటు దేశ‌వ్యాప్తంగా ఉన్న 4 వేలకుపైగా స్క్రీన్లలో సెప్టెంబర్ 20న దేశంలో ఎక్కడైన రూ. 99లకే మూవీ చూసే బంఫర్ ఆఫర్ ప్రకటించాయి థియేటర్స్.  అలా అని 3d , రెక్లైనర్స్ , ప్రీమియం ఫార్మాట్ స్క్రీన్ కు ఈ ఆఫర్ రాదు. జస్ట్ మల్టీ ఫ్లెక్స్ మాత్రమే ఈ ఆఫర్. ఎంజాయ్ చెయ్యండి.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ticket-rates movies

Related Articles