Honey Trap: మహిళ వలలో పడి ISI కి ..సమాచారం లీక్ చేసిన రక్షణ ఉద్యోగి !

పాకిస్థాన్ కు గూఢచారిగా పనిచేస్తున్నాడనే అనుమానం రావడంతో ఆయనను వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు.


Published Mar 14, 2025 05:44:00 PM
postImages/2025-03-14/1741954516_103096625.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మహిళల వలలో పడి ..పెద్ద పెద్ద రాజ్యాలే పోయాయంటారు. సేమ్ అలానే ఫేస్ బుక్ లో పరిచయం అయిన ఓ మహిళ వలలో పడి .. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లో పనిచేసే వ్యక్తి ఓ ముఖ్యమైన సమాచారాన్ని ఐఎస్ ఐ కి లీక్ చేశారు. పాకిస్థాన్ కు గూఢచారిగా పనిచేస్తున్నాడనే అనుమానం రావడంతో ఆయనను వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు.


ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేసే రవీంద్ర కుమార్ అనే రక్షణ శాఖ ఉద్యోగి హనీ ట్రాప్ లో చిక్కుకున్నాడు. ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) వెంటనే ఆయనను అరెస్ట్ చేసింది. రవీంద్ర కుమార్ అనే ఉద్యోగి 'నేహా శర్మ' అనే మారు పేరుతో ఉన్న ఓ మహిళ ద్వారా ఐఎస్ఐఎకి సమాచారం చేరవేస్తున్నట్టు గుర్తించారు. గగన్ యాన్ అంతరిక్ష ప్రాజెక్ట్ , మిలిటరీ లాజిస్టిక్స్ -డెలివరీ డ్రోన్ ట్రయల్స్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను ఆయనను లీక్ చేసినట్లు గుర్తించారు. ఈయనతో పాటు మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.


ఫేస్‌బుక్ ద్వారా నేహా శర్మతో రవీంద్ర కుమార్‌ కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారి మధ్య వాట్సాప్ చాటింగ్ మొదలైంది. ఆన్‌లైన్ స్నేహం కాస్తా... వ్యక్తిగత విషయాలు, దేశ రహస్యాలు పంచుకునే వరకు చేరింది. ఈ క్రమంలోనే రవీంద్ర కుమార్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించిన కీలక సమాచారాన్ని నేహాతో పంచుకున్నాడు. అయితే గతంలోను ఇలాంటి కేసులు చాలా నమోదయ్యాయి. హనీ ట్రాప్ ద్వారా ఐఎస్ ఐ మహిళా ఏజెంట్లు పురుషులను వలలో వేసుకుంటారని ..రవీంద్ర కుమార్ తన ఫోన్‌ కాంటాక్ట్ లిస్టులో ఆ మహిళ నెంబర్ ను 'చందన్ స్టోర్ కీపర్ 2' పేరుతో సేవ్ చేసుకున్నాడని చెప్పారు. ఈ చర్యతో భధ్రతా విషయంలో , ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు , రక్షణ సంబంధిత సంస్థల్లో భద్రతా ప్రోటోకాల్స్ ను కఠినతరం చేయాలని ఉద్యోగులపై నిఘా మరింత పెంచాలని ఏటీఎస్ ఆదేశించింది.
 

newsline-whatsapp-channel
Tags : news-line honey terrarist department

Related Articles