PM Modi: మహాయజ్ఞం పూర్తయింది...ఎవరికైనా ఇబ్బందిపడితే క్షమించండి ..మోదీ !

ఇసుమంతైనా చోటులేని త్రివేణి సంగమంతో నెలన్నరపాటు.. కన్నుల పండువగా సాగింది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా.. ఫిబ్రవరి 26 శివరాత్రి పర్వదినంతో ముగిసింది.


Published Feb 27, 2025 09:22:00 PM
postImages/2025-02-27/1740671656_pmmodiatmahakumbh27353584816x90.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : 144 ఏళ్ల క్రితం వచ్చే మహాకుంభమేళా ముగిసింది. ఓ మహాధ్భుతాన్ని ఈ తరం చూడగలిగింది. పుణ్యస్నానాలు చేసి తరించారు. ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళాతో త్రివేని సంగమం పులకించింది. కొన్ని కోట్ల హిందువులను ఒక్క దగ్గర చూడగలిగాం. ఇసుమంతైనా చోటులేని త్రివేణి సంగమంతో నెలన్నరపాటు.. కన్నుల పండువగా సాగింది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా.. ఫిబ్రవరి 26 శివరాత్రి పర్వదినంతో ముగిసింది.


ఈ 45 రోజులపాటు.. దారులన్నీ ప్రయాగ్‌రాజ్‌వైపే అన్నట్లు సాగింది మహాకుంభమేళా.. చిన్న, పెద్ద తేడా లేకుండా.. కోట్ల మంది ప్రజలు ప్రయాగ్‌రాజ్‌ బాట పట్టారు.45 రోజుల పాటు జరిగిన మహాకుంభమేళాలో 66 కోట్ల మందికి పైగా హాజరయ్యారు. చివరి రోజైన శివరాత్రి రోజున దాదాపు 2 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. అనేక రాష్ట్రాల సీఎంలు, సినీతారలు కుంభమేళాలో పాల్గొని.. పవిత్న స్నానాలు ఆచరించారు. నేపాల్, భూటాన్, అమెరికా, ఇంగ్లాండ్, జపాన్ సహా అనేక దేశాల నుంచి ప్రజలు కుంభమేళాకు తరలివచ్చి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారు. 


మౌని అమావాస్య రోజు తొక్కిసలాట మినహా.. మిగతా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా యూపీ సర్కార్ అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. దీనికోసం సోమనాథ్‌ను సందర్శించి ప్రతి భారతీయుడి కోసం ప్రార్థిస్తానని ప్రధాని మోదీ చెప్పారు. కుంభమేళా యాత్ర సమయంలో భక్తులకు ఏదైనా అసౌకర్యం కలిగితే దానికి నేను క్షమించమని కోరుతున్నాను. ఇంకా పూజల్లో ఏదైనా లోపం ఉంటే క్షమించాలని గంగా , యమునా , సరస్వతి మాతలను ప్రార్ధిస్తున్నట్లు మోదీ తన బ్లాగ్ లో రాశారు.


 తీర్ధరాజ్ ప్రయాగ ప్రాంతంలో శ్రీ రాముడు , నిషాదరాజ్ కలిసిన ఐక్యత , సామరస్యం ప్రేమకు నెలవైన పవిత్ర ప్రాంతమైన శృంగవేరపూర్ కూడా ఉందని మోదీ రాశారు. ఈ మహాకుంభమేళాను చూసి ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయాయి. ఇంత పెద్ద కార్యం ఇంత ఈ జీగా అయిపోయిందంటే అదంతా భగవంతుని లీల అనే చెప్పాలంటూ చెప్పుకొచ్చారు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu narendra-modi mahakumbamela

Related Articles